టీడీపీ నేతలు, కార్యాలయాలపై ఏపీ వ్యాప్తంగా దాడులు.. అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు

Update: 2021-10-19 14:11 GMT
టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు టీడీపీ నేత పట్టాభి సహా పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దాడుల విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద విరిగిపోయిన గేటు,ధ్వంసం అయిన కార్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని ఘటనపై ఆరాతీశారు. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నేరుగా గవర్నర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

అనంతరం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి సైతం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతల నివాసాలు, కార్యాలయంపైన దాడులు జరుగుతున్నాయని.. తమకు కేంద్ర బలగాలను పంపాలని చంద్రబాబు కోరారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడుతానని చంద్రబాబుకు అమిత్ షా హామీ ఇచ్చారు.

టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. ఇక పార్టీ కార్యాలయంలో గాయపడిన సిబ్బందిని చంద్రబాబు పరామర్శించారు. దాడి జరుగుతున్న సమయంలో సెకండ్ ఫ్లోర్ లో కొందరు  పార్టీ నేతలు ఉన్నారు. దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే వారు చేరుకొనే లోగానే విధ్వంసం చేసేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కేంద్రా కార్యాలయంతోపాటు విశాఖ, హిందూపూర్ , కర్నూలు వంటి ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టు తెలిసింది. దీంతో వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతను పెంచేశారు.

-పట్టాభి వ్యాఖ్యలే టీడీపీ కార్యాలయాలపై దాడులకు కారణమా?
తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏకంగా సీఎం జగన్ పై తీవ్ర అభ్యంతరకర భాషలో మాట్లాడడమే వైసీపీ నేతలు భగ్గుమనడానికి కారణమని.. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగానే ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ‘రేయ్, బోసిడీకే’ అని పట్టాభి నోటి దురుసుగా వ్యాఖ్యానించాడని.. రాయడానికి వీలు లేని భాషలో తిట్ల పురాణం ప్రదర్శించాడని సమాచారం.  దీనికి పర్యావసనంగానే ప్రత్యర్థులు ఈ దాడులకు పాల్పడ్డట్టుగా చెబుతున్నారు. 
Tags:    

Similar News