ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆంధ్రాబ్యాంకు అన్న బోర్డు కనిపిస్తే చాలా తమవారిని చూసినంతగా ఆనందిస్తారు. అక్కడ తెలుగు మాట్లాడేవారు దొరికితే మాట్లడి సంతోషిస్తారు. వీలైతే పరిచయం పెంచుకుంటారు... ఏపీలో పుట్టినా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేలాది శాఖలతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఆంధ్రబ్యాంకు తెలుగు వారికి దేశమంతటా పెద్ద ల్యాండ్ మార్కు. ఆంధ్యా బ్యాంకు అన్న పేరు ఎంత పాపులరో, ఎంతగా ప్రఖ్యాతిగాంచిందో వేరే చెప్పనవసరం లేదు. అయితే... ఆ పేరు వల్లే ఆంధ్రబ్యాంకుకు ఒక్కోసారి నష్టం కూడా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైననో... ఆంధ్రకు చెందిన ఏ ఒక్కరిపైననో ఇతర రాష్ట్రాల ప్రజలకు కోపమొస్తే వారు మొట్టమొదటగా టార్గెట్ చేస్తున్నంది ఆంధ్ర బ్యాంకులపైననే. తాజాగా తిరుపతిలో ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేసినందుకు నిరసనగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఆందోళనల్లో భాగంగా కొందరు ఆంధ్రబ్యాంకు శాఖలపై దాడి చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలను రాళ్లతో పగలగొడుతున్నారు. తూత్తుకుడి పట్టణంలో ఉన్న ఆంద్ర బ్యాంకు పై కొందరు బాంబు విసిరారు.అయితే బ్యాంకు మూసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఎన్ కౌంటర్ తో కానీ... ప్రభుత్వంతో కానీ తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆంధ్రబ్యాంకుకు మాత్రం ఆస్తినష్టం తప్పడం లేదు.
గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రబ్యాంకులపై ఉన్న పేరులో ఆంధ్ర అనే పదాన్ని తెలంగాణ ఉద్యమకారులు తొలగించారు. కొన్ని చోట్ల దానిపై స్టిక్టర్లు అతికించి ఊరుకోగా కొన్ని చోట్ల ఎంతో డబ్బు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న సైన్ బోర్డులను పగులగొట్టారు. మహారాష్ట్ర, కేరళల్లోనూ వివిధ సందర్భాల్లో ఏపీ ప్రభుత్వాలపై ఉన్న కోపాన్ని ఆంధ్ర బ్యాంకుపై చూపించారు. దీంతో ప్రభుత్వ సంస్థ కానప్పటికీ ఆంధ్ర బ్యాంకు నష్టపోవాల్సి వస్తోంది.