1947 ఆగస్టు 15న ప్రముఖ దినపత్రికల్లో హెడ్ లైన్స్ ఇవే..

Update: 2021-08-15 10:31 GMT
ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. ఆ పరిణామం గురించి.. ఘటన గురించి పక్కరోజు దినపత్రికలో ఏం వస్తుందన్న ఆసక్తి చాలామందిలో వ్యక్తమవుతుంటుంది. ఇప్పుడంటే బహుముఖ మీడియాలు.. సోషల్ మీడియాలు.. వాట్సాప్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని ఏ మూలన ఎలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకున్నా.. పరిణామం జరిగినా గంటల వ్యవధిలో ఆ సమాచారం విశ్వమంతా వ్యాపించటమే కాదు.. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా దొరుకుతున్న పరిస్థితి.

మరి.. 75 ఏళ్ల క్రితం అంటే 1947 ఆగస్టు 15న .. దేశంలో చాలా ప్రాంతాల్లో కరెంట్ సౌకర్యమే అంతంతంగా ఉండేది. అలాంటి వేళ.. ఒక ప్రాంతానికి చెందిన సమాచారం.. మరో ప్రాంతానికి చేరాలన్నా.. ప్రజలకు తెలియాలన్నా అప్పుడున్న పరిస్థితుల్లో దినపత్రికలకు మించిన వార్తా సాధనం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడైతే క్షణాల్లో లైవ్ లు కళ్ల ముందుకు తీసుకొచ్చేస్తున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ స్ట్రీమింగులు నడుస్తున్న పరిస్థితి.

గడిచిన 75 ఏళ్లలో దేశంలో ఎంత మార్పు వచ్చింది.. సాంకేతికంగా మరెంత ముందుకెళ్లామన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఇలాంటి వేళ.. స్వాతంత్య్రదినోత్సవాన్ని అర్థరాత్రి వేళ ప్రకటించిన తర్వాత.. పక్కరోజు ఉదయం పలు దినపత్రికల మొదటి పేజీ ఎలా ఉందన్నది ఈ కింది వాటిని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఒక లుక్ వేయండి.
Tags:    

Similar News