దుబాయ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డాయి. న్యూజిలాండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండనేగా పూర్తి చేసి విశ్వ విజేతగా నిలిచింది. తొలిసారి తమ దేశానికి టీ-20 వరల్డ్ కప్ అందించి ఆస్ట్రేలియా సంబురాల్లో ముగిపోయింది.
2007లో టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభంకాగా 2021లో ఆస్ట్రేలియాకు దక్కింది. అప్పటికే క్రికెట్లో రారాజుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీ-20 వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్షగానే మారింది. టెస్ట్, వన్డే, ఛాంపియన్ వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీలు అందుకున్న ఆస్ట్రేలియాను టీ-20 వరల్డ్ కప్ మాత్రం ఊరిస్తూనే వస్తోంది.
2021లో దుబాయ్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ మాత్రం ఆస్ట్రేలియాకు బాగా కలిసి వచ్చింది. దుబాయ్ లో టాసే కీలక భూమిక పోషించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాకు టాస్ కలిసి రావడంతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ఆస్ట్రేలియా ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా సంబరాలు అంబరాన్నంటాయి.
సౌథీ బౌలింగులో మాక్స్ వెల్(28 నాటౌట్) విన్నింగ్ బౌండరీని కొట్టగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలోకి పరుగుత్తుకుంటూ వచ్చారు. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత డ్రెస్సింగు రూములో ఆటగాళ్లంతా గోలగోల చేశారు. ఇదే సమయంలో కొందరు ఆటగాళ్లు చిత్రవిచిత్ర చేష్టలు చేసి అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు.
ఆసీస్ కీపర్ మాథ్యువేడ్, ఆల్ రౌండర్ స్టోయినిస్ ఒక బూటులో శీతాలపానీయం(కూల్ డ్రింక్) పోసుకొని తాగారు. గెలుపు సంబరాల్లో భాగంగా కంగారులు ఇలా చేశారు. కంగారుల చేష్టలు కంగారెత్తించడం ఉండటాన్ని పలువురు ఆస్వాదీస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది.