టీ20 వరల్డ్ కప్: స్టాయినీస్ విధ్వంసం.. అసీస్ చేతిలో లంక చిత్తు

Update: 2022-10-25 16:02 GMT
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ లోనూ అదే రీతిలో తడబడింది. కానీ ఆల్ రౌండర్ స్టాయినీస్ వరుస సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడి తన జట్టును గెలిపించాడు.   మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియాను స్టాయినీస్ ఆదుకున్నాడు. 42 బంతులు ఆడి 31 పరుగులతో నెట్టుకొస్తున్న కెప్టెన్ ఫించ్ బాధ చూడలేకపోయిన స్టాయినీస్ లంక చేతిలో ఓడిపోకూడదనే పట్టుదలతో చెలరేగిపోయాడు. వరుసగా రెండో మ్యాచ్ ఓటమిని తప్పించాడు.

శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. నిస్సంక 40 పరుగులు, అసలంక 38 పరుగులతో లంక స్కోరును 150 దాటించారు.

అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన  ఆస్ట్రేలియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ఫించ్ జిడ్డుగా ఆడుతున్నాడు. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఆల్ రౌండర్ స్టాయినీస్ ఆటను మార్చేశాడు. అప్పటివరకూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులను చిత్తు చిత్తుగా కొట్టేశాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సులతో 59 నాటౌట్ తో చెలరేగి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు మ్యాక్స్ వెల్ 12 బంతుల్లోనే 23 పరుగులతో రెచ్చిపోయాడు.  

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి 7 ఓవర్ల వరకూ దారుణంగా ఆడింది. లంక బౌలర్లను ఎదుర్కోలేక ఫించ్ సహా అంతా చేతులెత్తేశారు. డేవిడ్ వార్నర్, మార్ష్ త్వరగా ఔట్ అయ్యారు. 7 ఓవర్లలో 38 పరుగులే చేసింది.  ఆ తర్వాత వచ్చిన స్టాయినీస్ సిక్సులతో భారీ షాట్లతో రెచ్చిపోయి ఆడుతూ టీంను ఒంటిచేత్తో గెలిపించాడు. 17 బంతుల్లోనే 50 పరుగుల చేసి వేగవంతంగా మ్యాచ్ ను ముగించాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News