పిచ్ లు స్పోర్టివ్ గా లేవు.. భారీ స్కోర్లు నమోదు కావడం లేదు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే.. లేదా ఛేదనకు దిగిన జట్టుదే విజయం.. భారత్ లీగ్ లోనే ఇంటి బాట పట్టిందిగా? ఇంకేం చూస్తాంలే..? ఇదీ టి20 ప్రపంచ కప్ విషయంలో మన దేశంలోని సగటు అభిమాని ఆలోచన. అదే మన దేశంలో జరిగి ఉంటేనా? దుమ్ము రేగి ఉండేదని కొందరి భావన. కానీ, దుబాయ్ లో జరగడం.. టీమిండియా ఎన్నడూ లేనట్టు పాకిస్థాన్ చేతిలో ఓడడంతో చాలామందికి ఆసక్తి పోయింది. న్యూజిలాండ్ మీద కూడా పరాజయం పాలవడంతో ఉసూరుమన్నారు. కచ్చితంగా చెప్పాలంటే .. ఊర్లలోని సగటు అభిమానులు నిరాశతో మ్యాచ్ లు చూడడమే బంద్ చేశారు.
చూసింది వారే..
క్రికెట్ ను కాలక్షేపంగా కాక.. ఓ ఆటగా, వినోదంగా.. అంతకుమించి అభిమానంతో చూసే ప్రజలు ఉంటారు. వారే వీరాభిమానులు. మ్యాచ్ ఫలితాలతో వారికి సంబంధం లేదు. ఆటగాళ్ల వైఫల్యాలతో పట్టింపు లేదు. ఏ దేశం ఆడుతోంది అన్నది విషయం కాదు.. ‘‘మ్యాచ్’’ ఉన్నదా లేదా? అన్నదే వారికి ముఖ్యం. ఇలాంటి వారే ఇటీవల ప్రపంచ కప్ ను ఆసాంతం ఫాలో అయ్యారు.
‘హేమా సెమీస్’తో మళ్లీ ప్రాణం
లీగ్ దశలో తక్కువ స్కోర్లతో విసుగొచ్చిందని అనేవారుంటారు. కానీ, వాస్తవానికి దుబాయ్, యూఏఈ పిచ్ లు ఆటకు సమానంగా స్పందించాయి. టి20 అంటే బాదుడే. కానీ, అన్నిసార్లూ బ్యాట్స్ మన్ పెత్తనమేనా? ఇక బౌలర్లు ఎందుకు? బంతులు విసరడానికేనా? అనేవారూ ఉన్నారు. ఇలాంటివారు ఇటీవలి ప్రపంచ కప్ ను ఎంజాయ్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగడంతో కప్ కు ఊపొచ్చింది. అందులోనూ ఫేవరెట్లయిన, కచ్చితంగా గెలుస్తాయనుకున్న ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఇంటి దారి పట్టడంతో ఆసక్తి మరింత పెరిగింది.
ఇంతకూ ఫైనల్ ఏకపక్షమా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ రసవత్తరంగా సాగిందా? ఏక పక్షంగా ముగిసిందా? ఇప్పుడీ చర్చ బాగా నడుస్తోంది. సాదాసీదాగా సాగిందని కొందరు.. పోటాపోటీ కరువైందని కొందరు ఇలా ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే విశ్లేషణ ప్రకారం చూస్తే .. మ్యాచ్ సమంగానే సాగింది. కానీ, బ్యాట్ తో ప్రారంభంలో, బంతితో ముగింపులో వెనుకబడిన న్యూజిలాండ్ ఓటమిపాలైంది. అంతే తేడా.. ఇందుకు గణాంకాలే నిదర్శనం. కివీస్ 170 పైగా పరుగులు చేయడం.. ఆసీస్ దానిని 19వ ఓవర్లో ఛేదించడం చూస్తే మ్యాచ్ ఏకపక్షమని ఎవరూ చెప్పలేరు. కాకపోతే.. ఎక్కడా తగ్గకుండా కంగారూలు కొట్టుకుంటూపోయారు. దీంతో మనకు పెద్దగా మజా అనిపించలేదు. ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు కోల్పోయి ఉంటే ఉత్కంఠ నెలకొనేది. వార్నర్ నిలబడడం, మిచెల్ మార్ష్ దంచేయడం .. మ్యాక్స్ వెుల్ మెరుపులతో ముగింపు సాఫీగా సాగిపోయింది.
మళ్లీ ఆసీస్ ప్రపంచ ముద్ర
టెస్టుల్లో రారాజుగా వెలుగొంది.. వన్డేల్లో ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు టి20 ఫార్మాట్ అచ్చి రాలేదు. 2007 నుంచి 2016 వరకు ఒక్కసారే ఫైనల్ కు చేరింది అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే, తాజాగా టి20 కప్ ను గెలవడం, అదికూడా తమకు నప్పని దుబాయ్ పిచ్ లపై గెలవడం ఆస్ట్ర్రేలియా ఘనతను పెంచింది. దిగ్గజాల రిటైర్మెంట్, కీలక ఆటగాళ్ల గాయాలు, ఫామ్ లేమి.. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కష్టాల్లో ఉన్న ఆ జట్టుకిది ఇది కచ్చితంగా ఊపిరి పోసే విజయమే.
వార్నర్ ఈజ్ బ్యాక్
బాల్ ట్యాంపరింగ్ తో ఏడాది పాటు జట్టుకు దూరం.. ఇకపై ఎప్పుడూ వైస్ కెప్టెన్సీ, కెప్టెన్సీ చేపట్టే వీల్లేకుండా నిషేధం.. ఆపై ఫామ్ లేమి.. ఐపీఎల్ లో అవమానకర రీతిలో సన్ రైజర్స్ వేటు.. కెప్టెన్సీ నుంచి కూడా తొలగింపు.. మళ్లీ కొనసాగించే అవకాశం కనిపించకపోవడం.. ఇదీ ఈ ప్రపంచ కప్ ముందు వరకు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిస్థితి. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ .. తన సత్తా ఏమిటో చూపుతూ వార్నర్ ఆస్ట్ట్రేలియాకు కప్ అందించాడు. సెమీస్, ఫైనల్స్ లో అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వార్నర్ విషయంలో సన్ రైజర్స్ చేసింది ముమ్మాటికీ తప్పే. అదే సంగతిని అభిమానులూ ఒప్పుకొంటారు. తాజాగా అతడి ప్రదర్శనను సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసిస్తున్నారు. సన్ రైజర్స్ సారథ్యం అప్పగించిన.. విలియమ్సన్ జట్టు ఫైనల్లో ఓడడం, వార్నర్ బాగా ఆడిన ఆస్ట్టేలియా గెలవడాన్ని పోల్చి చూస్తున్నారు.