ఇండియ‌న్ అమ్మాయితో మ్యాక్స్‌ వెల్ ప్రేమాయ‌ణం

Update: 2019-08-29 04:54 GMT
భారత అమ్మాయిలపై మనసు పారేసుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసీస్ జ‌ట్టులో టాప్ క్రికెట‌ర్లుగా ఉన్న వారద‌రూ భార‌త అమ్మాయిల బుట్ట‌లో ప‌డిపోతున్నారు. భార‌త్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే ఆసీస్ టాప్ క్రికెట‌ర్‌ - సిక్స‌ర్ల వీరుడు గ్లెన్ మ్యాక్స్‌ వెల్ ఓ భార‌త అమ్మాయి ప్రేమ‌లో ప‌డిపోయాడు. అయితే ఆ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని మొల్‌ బోర్న్‌లో స్థిర‌ప‌డిన ఓ భార‌త సంత‌తి ఫ్యామిలీకి చెందిన యువ‌తి వినీ రామన్‌ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్ర‌స్తుతం మ్యాక్స్‌ వెల్ - రామ‌న్ కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో ఎక్క‌డ చూసినా క‌లిసే సంద‌డి చేస్తున్నారు. వీధుల్లో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుండ‌డంతో మీడియాలో టాప్‌ గా నిలుస్తున్నారు. ఇక మ్యాక్స్‌ వెల్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ లో కూడా ప‌లు జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ఇక మ్యాక్స్‌ వెల్ మాత్ర‌మే కాదు మ‌రో ఆసీస్ టాప్ ఆట‌గాడు... ఆ జ‌ట్టు మాజీ పేస్ బౌల‌ర్ షాన్ టైట్ కూడా భారత అమ్మాయినే పెళ్లాడాడు. ఇప్పుడు మ్యాక్స్‌ వెల్-వినీరామన్ ఒక్కటైతే భారత యువతిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా మ్యాక్స్‌ వెల్ రికార్డులకెక్కుతాడు. ఇక షాన్ టైట్ ప్రేమ విష‌యానికి వ‌స్తే ఐపీఎల్‌ లో టైట్ ఆడుతున్న సంద‌ర్భంగా 2014లో జ‌రిగిన ఓ వేడుక‌లో మషూమ్ సింఘా‌తో షాన్‌ టైట్‌ కు పరిచయం అయింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

విదేశీ క్రికెటర్లు భార‌త అమ్మాయిల‌ను పెళ్లాడ‌డం అనేది ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌తంలో విండీస్ ధ‌నాధ‌న్ ప్లేయ‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్‌ - శ్రీలంక లెజెండ్రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కూడా చెన్నైకు చెందిన అమ్మాయిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వంతు ఆసీస్ క్రికెట‌ర్ల‌ది అయ్యింది.


Tags:    

Similar News