భారత్ మర్చిపోలేని బహుమతి ఇస్తున్నఆస్ట్రేలియా

Update: 2015-10-12 07:34 GMT
ఆస్ట్రేలియా దేశం మాట విన్న వెంటనే.. క్రికెట్ గ్రౌండ్లో ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు గుర్తుకు వస్తాయి. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా ఆస్ట్రేలియా సర్కారు.. భారత్ కు ఒక విలువైన బహుమతిని అందిస్తుంది. ఆస్ట్రేలియా అంటే అభిమానం పొంగుకొచ్చేలా భారతీయుల మదిని దోచుకునేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది.

దాదాపు 2 వేల ఏళ్ల నాటి బుద్ధుడి విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రాంతానికి చెందిన ఈ విగ్రహం.. కొన్నేళ్ల కిందట చేతులు మారి ఆస్ట్రేలియాకు చేరుకుంది. ప్రస్తుతం క్యాన్ బెరాలోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో ఉంది.

ఈ విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాలని ఆస్ట్రేలియా సర్కారు నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే జర్మనీ ఛాన్సలర్ మార్కెల్ ఏంజెల్ తన భారత పర్యటన సందర్భంగా ప్రాచీన దుర్గామాత విగ్రహాన్ని తిరిగి ఇవ్వటం తెలిసిందే. జర్మనీ సర్కారు నిర్ణయాన్ని చూసి స్ఫూర్తి పొందిందో.. మరే ఇతర కారణమో కానీ.. తాజాగా రెండు వేల ఏళ్ల నాటి బుద్ధుడి విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇవ్వటానికి రెఢీ కావటం భారతీయులంగా సంతోషించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News