గంభీర్ ఒక టెర్రరిస్టు అన్న జర్నలిస్టు

Update: 2018-04-29 11:13 GMT
భారత సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు దేశభక్తి పాళ్లు కొంచెం ఎక్కువే. దేశానికి సంబంధించిన ఏవైనా వివాదాలు తలెత్తినపుడు చాలా ఓపెన్ గా తన అభిప్రాయాలు చెబుతుంటాడు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినపుడు.. మన సైనికులకు ఏమైనా జరిగినపుడు.. ప్రాణాలు పోయినపుడు అతను ఆవేశం పట్టలేకపోతుంటారు. సైనికుల పిల్లల కోసం అతను భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించడం.. కొందరు పిల్లల్ని దత్తత కూడా తీసుకోవడం తెలిసిన సంగతే. దాయాది పాకిస్థాన్ పేరెత్తితే అతను మండిపోతుంటాడు. ఈ నేపథ్యలో తాజాగా మరోసారి ఆ దేశీయులపై తన వ్యతిరేకతను చూపించాడు గంభీర్. పాకిస్థానీయులెవరినీ మన దేశంలోకి అనుమతించకడూదని అతను అభిప్రాయపడ్డాడు. దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి అతను విజ్ఞప్తి కూడా చేశాడు.

ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్మన్ తీవ్రంగా స్పందించాడు. గంభీర్ ను టెర్రరిస్టుగా అభివర్ణించాడు. భారత్-పాకిస్థాన్ సంబంధాల గురించి గంభీర్ చేసిన వ్యాఖ్యల్ని అతను తప్పుబట్డాడు. గంభీర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని.. అది మంచిది కాదని.. అతడి మాటలు టెర్రరిస్టుల తరహాలో ఉన్నాయని ఫ్రీడ్మన్ అన్నాడు. ఐతే గంభీర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టడంలో ఫ్రీడ్మన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నాడు. బేసిగ్గానే ఫ్రీడ్మన్ భారత క్రికెటర్ల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తుంటాడు. ఇంతకుముందు సచిన్ అంటే ఎవరు అని రాసి ఉన్న జెర్సీని అతను సోషల్ మీడియాలో షేర్ చేయడం దుమారం రేపింది. సచిన్ అభిమానులు అతడిపై తీవ్రంగా మండిపడ్డారు. భారత క్రికెటర్లను.. అభిమానుల్ని ఏదో రకంగా కవ్వించడం ఫ్రీడ్మన్ కు అలవాటే కాబట్టి గంభీర్ పై అతడి వ్యాఖ్యల్ని కూడా లైట్ తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 
Tags:    

Similar News