ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి లెక్క తేల్చేందుకు ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు కిందామీదా పడుతున్నారు. దాని అంతు చూసే అద్భుత అవకాశాన్ని తామే అందిపుచ్చుకోవాలని విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇలాంటివేళ.. కరోనా జెనటిక్ కోడ్ ను విశ్లేషించే సరికొత్త పద్దతిని బ్రిటన్.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఉమ్మడి టీం ఒకటి చేసింది. ఇందులో మనోళ్ల గొప్పతనం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ టీంను లీడ్ చేసింది మనోడే మరి.
భారత సంతతికి చెందిన శేషాద్రి వాసన్ అనే ప్రవాస భారతీయుడు కరోనా జెనటిక్ కోడ్ గుట్టు విప్పేశాడు. బిట్స్ పిలానీలో బీఈ.. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఎమ్మెస్సీ చదివిన ఇతగాడు ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ లో సేవలు అందిస్తున్నారు.
కరోనా జెనటిక్ కోడ్ ను విశ్లేషించే కొత్త పద్దతి ద్వారా వైరస్ లో చోటు చేసుకునే జన్యుపరమైన మార్పుల ప్రాతిపదికగా.. దాంతో ఎదురయ్యే వ్యాధుల ముప్పును ముందుగా తెలుసుకునే వీలుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొవిడ్ 19 వేలాది జన్యుక్రమాల మధ్యనున్న చిన్నచిన్న తేడాల్ని సైతం అత్యంత కచ్ఛితత్త్వంతో విశ్లేషించే వీలుంటుంది. తాజా ఆవిష్కరణ తో.. కరోనా పీచమణిచే వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడనున్నాయి. ఏమైనా మనోడి గొప్పతనాన్ని నిండు మనసుతో పొగడాల్సిందే.