ప్రళయం.. మహాప్రళయం.. భూ మండలం మొత్తం మటాష్ అయిపోవటం లాంటి వార్తలు ఇప్పటివరకూ చాలానే విన్నాం. కానీ.. అలాంటిదేమీ ఇప్పటివరకూ జరిగింది లేదు. కాకుంటే.. అప్పుడప్పుడు ప్రకృతి ప్రకోపించటంతో మానవజాతి వణికిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచం త్వరలో నాశనం కాబోతుందంటూ పలు సందర్భాల్లో పలువురు వాదనలు వినిపిస్తూ ఉంటారు. అందులో నిజానిజాలు ఎంతన్నది తర్వాత.. ఇలాంటివి ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
తాజాగా అలాంటి మాటల్నే చెబుతున్నారు ఒక పుస్తక రచయిత. ఆయన చెబుతున్న మాటల్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నా.. జనాల ఇంట్రస్ట్ మాత్రం రోజురోజుకీ మరింత ఎక్కువ అవుతోంది. ఆయన మాటల్ని లెక్కల్లోకి తీసుకుంటే.. ఈ భూమండలం మహా అయితే మరో తొమ్మిది నెలలు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత అంతమైపోతుందని చెబుతున్నారు. ఎందుకిలా అన్న ప్రశ్నకు ఆయన చెబుతున్న సమాధానం ఏమిటంటే.. నిబరు అనే గ్రహం ఒకటి ఉందని.. దాన్ని ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తుంటారని.. అది సౌర కుటుంబం అంచున ఉందని ఆయన నమ్మకంగా చెబుతుంటారు.
ఆ గ్రహం వేగంగా దూసుకొచ్చి.. అక్టోబరు మాసంలో భూమిని తాకుతుందన్నది ఆయన లెక్క. ఈ గ్రహం.. భూమిని బలంగా ఢీ కొట్టటంతో ప్రపంచం మొత్తం అంతమైపోతుందని ఆయన చెబుతున్నారు. అయితే.. నిబరు అనేది సదరు రచయిత ఊహాల్లో సంచరించే గ్రహమే తప్పించి.. వాస్తవంగా అలాంటి గ్రహం అన్నది లేదన్నది శాస్త్రవేత్తల మాట. అయితే.. సదరు పుస్తక రచయిత మాత్రం.. నిబరు గ్రహం ఉందని.. అది అక్టోబరులో ప్రపంచాన్ని అంతమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. మరి.. ఆయన మాటలు తప్పని తేలటానికి అక్టోబరు వరకూ ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/