ప్రసిద్ధ రచయితకు జీవిత ఖైదు.. భర్తను ఎలా చంపాలో వ్యాసి రాసి.. సంచలన నిర్ణయం
సాధారణంగా.. ఏ భార్య అయినా.. భర్త పట్ల ఎంతో ప్రేమ కురిపిస్తుంది. ఎక్కడొ ఒకరో ఇద్దరో.. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తల పట్ల అఘాయిత్యాలకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎవరూ కూడా ఇప్పటి వరకు ''భర్తను చంపడమెలా?'' అని వ్యాసంఅయితే.. రాసి ఉండరు.. ఒకవేళ రాసినా.. అందులో రాసుకున్న ప్రతి అక్షరాన్నీ వాస్తవంలో అమలు చేయరు. అదో ఫిక్షన్‌గా వదిలేస్తారు. కానీ, అలా అయితే.. తనకు పేరు ఎలా వస్తుందని అనుకుందో ఏమో.. ఆ రచయిత.. దారుణానికి ఒడిగట్టింది.
'భర్తను చంపడం ఎలా?' అనే వ్యాసం రాసిన ఓ మహిళ.. సొంత భర్తను హత్య చేసిన కేసులో కటకటాలపా లైంది. అమెరికా పోర్ట్లాండ్కు చెందిన నిందితురాలు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీకి (71) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
ఆ మహా రచయిత ఎవరంటే..
రొమాంటిక్ నవలలు రాసే నాన్సీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నాయి. ఆమెకు మంచి రచయితగా పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అయితే.. తన భర్త డేన్ బ్రోఫీని(63) అతడి ఆఫీసులోనే హత్య చేసింది. నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. 2018లో ఒరేగాన్ కల్నరీ ఇన్స్టిట్యూట్లో డేన్ బ్రోఫీ పనిచేస్తుండగా.. అతడిని తుపాకీతో కాల్చి చంపింది నాన్సీ. జీవిత బీమా డబ్బుల కోసమే అతడిని హత్య చేసినట్లు తేలింది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు చాలా ఏళ్ల ముందే 'భర్తను హత్య చేయడం ఎలా?' అనే వ్యాసం రాసి వార్తల్లో నిలిచింది నాన్సీ.
ఇంటర్నెట్లో వెతికి మరీ..
హత్య జరిగిన సమయంలో దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇంటర్నెట్లో వెతికి మరీ.. ఓ ఘోస్ట్ గన్ కిట్ను నాన్సీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత గ్లాక్ 17 అనే హ్యాండ్ గన్ను ఓ ప్రదర్శన నుంచి సేకరించింది. అయితే, నాన్సీ తరఫు న్యాయవాది ఈ వాదనలను కొట్టిపారేశా రు. దంపతులు ఆర్థిక కష్టాల్లో ఉన్న విషయం వాస్తవం కాదన్నారు.
వీరిద్దరి మధ్య అన్యోన్య దాంపత్య బంధం ఉండేదని తెలిపారు. ఈ మేరకు పలువురు సాక్షులను సైతం ప్రవేశపెట్టారు. తన భర్తతో కలిసి సంయుక్తంగానే జీవిత బీమా తీసుకున్నామని నాన్సీ స్పష్టం చేశారు. ఇక, అంతర్జాలంలో తుపాకుల గురించి వెతకడంపైనా స్పష్టతనిచ్చారు. తర్వాతి నవల రాయడం కోసం తాను తుపాకుల గురించి పరిశోధించానని చెప్పుకొచ్చారు.
25ఏళ్ల తర్వాత పెరోల్!
ఏడు వారాల పాటు సాగిన విచారణలో.. వాదనలన్నీ విన్న జడ్జీలు, జ్యూరీ.. నాన్సీని దోషిగా తేల్చారు. సెకండ్ డిగ్రీ హత్యకు పాల్పడినట్లు నిర్ధరించారు. అనంతరం జీవిత ఖైదు విధించారు. 25 ఏళ్ల జైలు శిక్ష తర్వాత పెరోల్ లభించేలా తీర్పు వెలువరించారు.