రాజకీయనేతలకు ఉండే ఈగో అంతా ఇంతా కాదు. విపక్షంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకున్నట్లుగా కనిపించే వారు.. తమ పార్టీ పవర్లో ఉంటే చాలు చెలరేగిపోతుంటారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అన్న తేడా లేకుండా దేశంలోని చాలా పార్టీల్లో అలాంటి తీరే కనిపిప్తోంది. పవర్లో ఉన్న తమను ఎవరూ.. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించకూడదన్నది ఇప్పటి ట్రెండ్.
అధికారంలో ఉన్న తమనే ప్రశ్నించే సాహసం చేస్తారా? అన్నట్లుగా మారింది అధికారపార్టీ నేతల తీరు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి చిక్కుల్లో చిక్కుకున్న బీజేపీ మహిళా నేత.. అనూహ్యమైన తెలివిని ప్రదర్శించి.. గంటల్లో తన తప్పును ఒప్పు చేసుకునే పని చేశారు. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందా? ఒకే.. మరింత డిటైల్డ్ గా చెబుతాం.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్. ఆమె ఒక చోట మాట్లాడుతుంటే.. అక్కడికి కదిర్ అనే ఆటో డ్రైవర్ వచ్చాడు. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరపై సీరియస్ గా ప్రశ్నించాడు.అంత సూటిగా ప్రశ్నలు వేయటం తమిళ కమలనాథులకు అస్సలు నచ్చలేదు.
అంతే.. అతగాడిని సమావేశం నుంచి బయటకు గెంటేశారు. మరింత జరుగుతున్నప్పుడు చుట్టు ఉండే కెమేరాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి కదా? పెట్రోల్ ధర పెంపుపై ప్రశ్నిస్తే.. అలా బయటకు గెంటేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు తమిళిసాయి.
కదిర్ తాగి ఉన్నాడని.. అందుకే తాము బయటకు పంపామే తప్ప మరింకేమీ లేదని చెప్పటంతో సరి పెట్టకుండా.. తాము గెంటేసిన ఆటో డ్రైవర్ కదిర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి.. సరికొత్త సారీల పర్వానికి తెర తీశారు. అనుచరులతో కలిసి కదిర్ ఇంటికి వెళ్లి.. ఆయనకు.. ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద స్వీట్ బాక్స్ ను అందించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ద్వారా.. తనను తప్పు పడుతున్న వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
తనపై చేయి చేసుకున్న విషయం తనకు గుర్తు లేదని ఆటో డ్రైవర్ కదిర్ వ్యాఖ్యానించాడు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టే తాను ప్రశ్నించానని చెప్పారు. ఇదిలా ఉంటే.. స్వీట్ బాక్స్ తో పాటు.. అతన్ని గెంటేసిన పార్టీ నేతల తీరుకు సారీ చెప్పేశారు తమిళి సాయి.
ఇదిలా ఉంటే.. అంత పెద్ద మేడమ్ గారు తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి స్వీట్లు ఇచ్చి మరీ సారీ చెప్పిన వైనంపై కదిర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్నారు కాబట్టే పెట్రోల్ ధరల పెంపుపై తాను ప్రశ్నించానని.. అయితే త్వరలోనే తగ్గిస్తానని ఆమె చెప్పినట్లుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంపై తన విమర్శల్ని మార్చేసిన కదిర్ రాష్ట్ర సర్కారుపై గురి పెట్టాడు. కేంద్రం ధరలు తగ్గించినా రాష్ట్రం ధరలు తగ్గించటం లేదన్నారు. చూస్తుంటే.. స్వీట్ బాక్స్ ఎఫెక్ట్ కదిర్ మీద బాగానే కనిపిస్తున్నట్లు లేదు!