చిన్న అవకాశం ఉన్నాఎదుటోడ్ని మోసం చేయాలి.. వాడిని ఏదోలా బోల్తా కొట్టించి డబ్బులు లాగేయాలన్నట్లుగా వ్యవహరించే దొంగలు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యారు. అలాంటివేళలోనూ.. నిజాయితీ ఇంకా బతికే ఉందని.. పూర్తిగా డబ్బులే ప్రపంచంగా మారిన పాడు కాలంలోనూ.. విలువలతో బతికేటోళ్లు.. పక్కోడి సొమ్మును పాములా భావించే మంచోళ్లు మనచుట్టూనే ఉన్నారన్న విషయం తెలిసినంతనే ఆనందంతో పాటు.. మరింత ఆత్మస్థైర్యం కలుగుతుంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవలోకే వస్తుంది.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన ఈ రియల్ సీన్ లోకి వెళితే.. హాలీమా అనే మహిళ రామగుండం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కింది. తిలక్ నగర్ డౌన్ లో ఆటో దిగేసింది. అయితే.. ఆమె తన పర్సును ఆటోలోనే మర్చిపోయారు. ఆటో దిగిన హాలీమా తన పర్సును ఆటోలో మర్చిపోయినట్లుగా గుర్తించారు. అందులో పన్నెండు తులాల బంగారంతో పాటు నగదు ఉంది. వెంటనే ఆమె దగ్గర్లోని పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆటోను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అయితే.. అప్పటికే సదరు ఆటో డ్రైవర్ తన ఆటోలో హాలీమా మర్చిపోయిన పర్సునుచూసి వెంటనే గోదావరి ఖనిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. తనకు దొరికిన నగల కోసం కక్కుర్తి పడకుండా నిజాయితీగా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ అజ్జూను పోలీసులే కాదు.. స్థానికులు అభినందిస్తున్నారు. ఇలాంటి మంచోడ్ని మరింతగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాదంటారా?