ఒక కొడుకు తన తండ్రి ఫలానా? అంటూ న్యాయపోరాటానికి దిగాల్సి రావటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. కానీ.. ఆ పని చేయటమే కాదు.. ఆ న్యాయపోరాటంలో దేశం మొత్తం దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు ఉత్తరాఖండ్.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. ఆ తర్వాతి కాలంలో గవర్నర్ గా పలు రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహించిన ఎన్డీ తివారి కుమారుడు రోహిత్.
తన తండ్రి తివారీ అంటూ రోహిత్ చేసిన పోరాటానికి కోర్టు కూడా అవునని చెప్పింది. ఇదిలా ఉండగా..మధ్యవయస్కుడైన ఆయన తాజాగా ఆకస్మిక మరణానికి గురి కావటం షాకింగ్ గా మారింది. అయితే.. ఆయన మరణం అనారోగ్యం కారణమన్న వార్త తొలుత వచ్చింది. తాజాగా ఆయన మరణంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఊపిరి ఆడకపోవటం తోనే మృతి చెందినట్లుగా వైద్య నివేదిక స్పష్టం చేయటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
తొలుత సహజ మరణం అనుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా వైద్య నివేదిక ఉండటం పలు అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ తల్లి ఉజ్వలా తివారీ మాట్లాడుతూ.. తన కొడుకుది సహజ మరణంగా ఆమె చెబుతున్నారు. వైద్య నివేదిక నేపథ్యంలో పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.
ఫోరెన్సిక్.. క్రైం బ్రాంచ్ కు చెందిన బృందాలు ఇప్పటికే రోహిత్ ఇంటికి చేరుకొని ఆధారాల్ని సేకరిస్తున్నాయి. ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న రోహిత్ ను అంబులెన్స్ లో ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా డాక్టర్లు పేర్కొన్నారు. రోహిత్ మరణానికి ఒక రోజు ముందు ఆయన ఉత్తరఖండ్ కు బయలుదేరి వెళ్లారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతారు.
వృత్తిపరంగా లాయర్ అయిన రోహిత్.. రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ కు సలహాదారుగా ఉన్నారు. అలాంటి ఆయన మరణం ఇప్పుడు హత్యగా అనుమానించటం సంచలనంగా మారింది.