ఆవకాయ. ఆంధ్రులకు మాత్రమే వంటబట్టిన వంట పాండిత్యం. తన విస్తరిలో ఎన్ని పదార్ధాలు ఉన్నా ఆవకాయ కోసం నోరు తెరచి చూస్తాడు ఆంధ్రుడు అని ఒక సామెత కూడా ఉంది. వరి అన్నంలో ఎర్రటి ఆవకాయ వేసి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. అసలు ఆంధ్రుడిగా పుట్టడం ఎందుకంటే ఆవకాయను తినడం కోసమే. ఈ జన్మ ధన్యం అయిందని ఎవరైనా భావిస్తారు అంటే ఆవకాయతో అన్నం తిన్నపుడే.
ఇక ఆవకాయ ప్రతీ ఏటా వేసవి మూడు నెలల్లో ప్రతీ ఇంటా పెడతారు. ఒక విధంగా ఆంధ్రా ఆవకాయ అన్నది ఇంటింటి అమృతంగా ఉంటుంది. ఆవకాయ కోసం ఆరు నెలల నుంచి ప్లాన్స్ వేస్తారు. మంచి మామిడి కాయ దొరకగానే కొని బ్రహ్మాండమైన వంట నూనేను జత చేసి దట్టంగా గుంటూరు కారం దట్టించి ఆవ ముద్దను కలిపి ఇంగువ వేసి మిగిలిన దినుసులు చేర్చి అచ్చమైన ఆంధ్రాపాకంగా ఆవకాయను ఎర్రగా తయారు చేస్తే చూస్తేనే కడుపు నిండిపోతుంది.
ఇక గోదావరి జిల్లాలలో ఎన్ని వంటకాలు ఉన్నా ఆవకాయ ఉండాల్సిందే. పోటీలు పడి ఆవకాయ పెడతారు. మామిడి తోటలు విస్తారంగా ఉండడంతో పాటు ఆవకాయ రుచి మరిగిన వారంతా అక్కడే ఉంటారు కాబట్టి ఆవకాయ పోటీలు కూడా యమ రంజుగా సాగుతాయి. అలాంటి ఆవకాయకు ఈ ఏడాది కరవు రోజులు వచ్చేశాయి.
నేను రాను బిడ్డో అంటోంది ఆవకాయ్. ప్రతీ ఇంటా గూట్లో అందంగా అమరాల్సిన ఆవకాయకు ఒక విధంగా ఈ ఏడాది గ్రహణం పట్టేసింది అంటున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి కాయల ధరలు నింగిని అంటేశాయి. పోనీ మిగిలినవి ఏమైనా తక్కువ తిన్నాయా అంటే వంట నూనెల ధరలు వందలు దాటిపోతున్నాయి. కారం చూస్తే కంట్లోనే మంట పెట్టేల రేటు ఉంది. ఇలా ఆవకాయకు అన్నె అపశకునాలే ఈసారి వచ్చిపడ్డాయి.
మామూలుగా గోదారి వారి భాషలో ఏంటంటారు అంటే అప్పు చేసైనా ఆవకాయ పెట్టేయమని. ఈసారి అప్పు కాదు కదా ఎన్ని కుదవ పెట్టినా ఆవకాయ మాత్రం పెట్టడం శానా కష్టమని అనేస్తున్నారు. దాంతో అప్పులు సొప్పులు చేసి ఒళ్లూ ఇల్లూ గుల్ల చేసుకుని ఆవకాయ పెట్టకపోతేనేంటి అన్న ఆలోచనలు జనాలు వచ్చేస్తున్నారు.
బయట మార్కెట్ లో రెడీమేడ్ గా దొరికే ఆవకాయ సీసాలతో ఈ సీజన్ అంతా సర్దుకుపోదామని అనుకుంటున్నారు. మనసులో ఆవకాయ పెట్టాలని, జాడీలకు జాడీలు జత చేసి అటక ఎక్కించాలని ఉన్నా ధరలను చూసి తట్టుకోలేకనే ఆవకాయకు ఈ ఏడాది అలా గోవిందా కొట్టేస్తున్నారు అన్నమాట.
దీని మీద ఇపుడు చాలా రకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలే ఒక తరం వంటలకే దూరం అవుతున్న వేళ ఆవకాయ లాంటి ఏడాది గ్రాసం కోసమైనా ఒళ్లు వంచి ఇది మంట ఆంధ్రాశాకం అని గర్వంగా పెట్టుకునే వారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆవకాయ పెట్టడం మరచిపలేదు. అలాంటిది ఈ పెరిగిన ధరలు ఈ అలవాటుకు అనాదిగా వస్తున్న ఆవకాయ ఆచారానికి గండి కొట్టేశాయి.
మరి ఒక ఏడాది బ్రేక్ ఇచ్చేశాక వచ్చే ఏడాది ధరలు అదుపులోకి వచ్చినా ఆవకాయ ప్రతీ ఇంటా జాడీలతో అటక ఎక్కుతుందా అంటే డౌటే మరి. ఎందుకంటే ఒకసారి వరస తప్పించేస్తే అది ఆవకాయకే అరిష్టం కాబట్టి. మొత్తానికి ఆంధ్రుల అసలైన పాకం అయిన ఆవకాయ పుట్టి బుద్దెరిగి ఇన్నేసి కష్టాలు పడలేదు. చూడాలి మరి ఆవకాయకు మంచి రోజులు వస్తాయా. ప్రతీ ఇంట ఆ ఎర్రని మెరుపులు రేపటి రోజులలో చూస్తామా. వెయిట్ అండ్ సీ