డీలాగా బేలగా.... పేర్ని నాని ఎందుకిలా ?
ఆయన మీడియా ముందుకు వస్తే మాటల ప్రవాహంతో వెల్లువలా దూసుకుని పోయేవారు. మాటలలో విరుపులు ఆయనకే సొంతం అన్నట్లుగా ఉండేది.
పేర్ని నాని అంటేనే ఫైర్ బ్రాండ్. మాటకు మాట. పంచ్ కి పంచ్ . అక్కడ అన్నది పవన్ కళ్యాణ్ అయితే వెంటనే ఇక్కడ వైసీపీ ఆఫీసులో పేర్ని నాని తయార్ అన్నట్లుగా సీన్ ఉండేది. ఆయన చంద్రబాబుని కానీ లోకేష్ ని కానీ పవన్ ని కానీ ఎక్కడా వదిలేదు లేదు అన్నట్లుగా మీడియాలో దూకుడు చేసేవారు. తనదైన సెటైర్లతో అల్లల్లాడించేవారు. ఆయన వెటకారం డాట్ కం తో ప్రత్యర్ధులకు గుక్క తిప్పుకోనిచ్చేవారు. కాదు. అలాంటి నానిలో ఫైర్ ఏమైంది అని ఆయన ఫ్యాన్స్ వైసీపీ అనుచరులు కలవపడేలా ఉంది లేటెస్ట్ ఎపిసోడ్.
ఆయన చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఆయన రేషన్ బియ్యం కేసులో ఇబ్బంది పడుతున్నారు. ఏకంగా పేర్ని నానితో పాటు కుమారుడు పేర్ని కిట్టు, ఆయన సతీమణి జయసుధ మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. అన్నింటికీ మించి తన సతీమణి మీద కేసులు నమోదు కావడం పట్ల పేర్ని నాని చాలా ఆవేదనకు గురి అయినట్లుగా కనిపిస్తోంది.
ఆయన మీడియా ముందుకు వస్తే మాటల ప్రవాహంతో వెల్లువలా దూసుకుని పోయేవారు. మాటలలో విరుపులు ఆయనకే సొంతం అన్నట్లుగా ఉండేది. ప్రత్యర్ధులకు ఆ మీడియా మీటింగ్ చూస్తే దడ పుట్టాల్సిందే అన్న తీరున సాగేది. మీడియా ఎటువంటి చిక్కు ప్రశ్నలు అడిగినా ఏ మాత్రం తడుముకోకుండా నాని ఇచ్చే జవాబులు అందులో పంచులు కూడా ఆకట్టుకునేవి.
అలాంటి నాని కేసులతో ఉక్కిరిబిక్కిరి అయి ఎలా అయిపోయారు అని మీడియా వారే ఆశ్చర్యపోయే పరిస్థితి. తన భార్యను ఈ కేసులోకి తెస్తున్నారు అని నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో ఆడవారిని రాజకీయాల్లోకి లాగడం సబబా అని ఆయన సున్నితంగానే ప్రశ్నిస్తున్నారు.
అదే సమయంలో ఆయన టోన్ లో కూడా భారీ చేంజి కనిపిస్తోంది. ఎక్కడా దూకుడు అన్నది లేదు, ఫైర్ అన్న ఊసే లేదు. ఆయన ప్రభుత్వం మీద మెత్తమెత్తగానే మాట్లాడుతున్నారు. తన ఏరియా మంత్రి ఒకరు ఇలా చేస్తున్నారు అని ఆయన ఒక్కరి మీదనే కాస్తా టార్గెట్ చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం మీద ఏమీ అనడం లేదు.
పైపెచ్చు చంద్రబాబుని ఆయన పొగడడం 2024 ఇయర్ ఎండింగులోనే టాక్ ఆఫ్ ది పొలిటికల్ మ్యాటర్ గా మారుతోంది. ఆడవాళ్లను అరెస్ట్ చేస్తామని ఒక మంత్రి ప్రయత్నాలు చేస్తూంటే బాబు వద్దు అని వారించారు అని నాని చెబుతూ బాబు మీద మెచ్చుకోలుగా మాట్లాడటం చూసిన వారు పేర్ని నానిలో ఈ మార్పు ఏమిటి అని షాక్ తింటున్నారు.
ఆయన నేను ఎక్కడికీ పోలేదు ఇక్కడే ఉన్నాను అని అంటున్నా ఆయన మీడియాకు కనిపించి చాలా రోజులే అయింది. ఆయన చివరి సారిగా మీడియా ముందుకు వచ్చినపుడు కూడా కాస్తా దూకుడు గానే మాట్లాడారు. అది కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ కాకినాడ సముద్రం మధ్యలోకి వెళ్లడాన్ని కూడా మెచ్చుకోవడం ఒక చర్చ అయింది. ఇపుడు ఏకంగా సీఎం ని మెచ్చుకుంటున్నారు.
మొత్తానికి పేర్ని నానిలో భారీ మార్పు వస్తోంది. ఆయన వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ అన్న ముద్ర నుంచి మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారు. ఈ మార్పు వీలైతే ఆయన ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సాగుతుందా లేక ఏకంగా రాజకీయాలకే విరామం ప్రకటించేలా మారుతుందా అన్నదే అంతా చర్చిస్తున్నారు. ఏది ఏమైనా కొందరికి కొన్ని మాత్రమే నప్పుతాయి. కొత్త షేడ్స్ వారిలో చూడలేరు.
అలాగే నాని విషయం తీసుకుంటే ఆయన ఫైర్ వెటకారం తోనే అట్రాక్ట్ చేస్తారు. మీడియా కూడా అందుకే నాని ప్రెస్ మీట్లను కవర్ చేస్తుంది. అటువంటి నాని ఇపుడు బేలగా మారిపోయారు అంటే పాలిటిక్స్ లో ట్రిక్స్ ఇవే కదా అంటున్నారు. అవును రాజులను తరాజులుగా మార్చే రోజులను తెచ్చేది అసలైన రాజకీయం. ఆ విషయం తెలిసి ఎవరైనా మసలుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉన్ననాడు ఎగిరిపడితే తరువాత రోజులలో కొత్త షేడ్స్ మాత్రమే తెచ్చుకుని అందులోనే అన్నీ దాచుకోవాల్సి వస్తుందని అంటున్నారు.