తెలుగుదేశానికి చెందిన నాయకులు ఎంపీలుగా ఉన్నారు గనుక మోదీని గట్టిగా అడిగి ప్రత్యేకహోదాను తీసుకురావడం వారి పని. అక్కడేదో ఎంపీలు అడగగానే మోడీ ఇచ్చేస్తాడు అన్నట్లుగా.. అడగకుండా వారే తప్పు చేస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ వారిని నిందించారు. ఎంపీలు అనుకుంటే హోదా వచ్చేస్తుంది అన్నట్లుగా పవన్ మాటలు ఉన్నాయి. అందుకే తెలుగుదేశానికి చెందిన ఓ ఎంపీ అదేస్థాయిలో పవన్‌కు రిటార్టు ఇచ్చారు. పైకి తాను త్యాగం చేస్తున్నట్లుగా, పవన్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగానే కవరింగ్ ఇస్తూనే.. పూర్తి వెటకారం చేశాడు.
ఆ ఎంపీ మరెవరో కాదు.. అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్. నిజానికి పార్లమెంటులో ప్రత్యేకహోదా గురించి గట్టిగానే గళం వినిపిస్తున్న తెలుగుదేశం ఎంపీల్లో అవంతి శ్రీనివాస్ కూడా ఒకరు. ఆయన ప్లకార్డులు కూడా పట్టుకుని.. మోడీ ప్రభుత్వాన్ని చికాకు పెట్టే స్థాయిలో చేశారు కూడా. అలాంటి అవంతి శ్రీనివాస్‌కు కోపం రావడంలో ఆశ్చర్యం లేదు.
ఎంపీ పదవితో హోదా వచ్చేస్తుందంటే.. నేను పదవికి తక్షణం రాజీనామా చేస్తా.. పవన్ కల్యాణ్‌ను ఈ అనకాపల్లినుంచి గెలవమని చెప్పండి.. నేరుగా పార్లమెంటుకు వెళ్లి హోదాను సాధించుకు రమ్మని చెప్పండి. మేమంతా కూడా ఆయన వెంటఉంటాం.. అంటూ అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. తన పదవిని వదిలేసుకుని మధ్యంతర ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను ఎంపీగా లోక్‌సభకు పంపడానికి సిద్ధం అంటూ సిటింగ్ ఎంపీ చెప్పిన మాటలు.. చూడ్డానికి బంపర్ ఆఫర్ లాగానే కనిపిస్తాయి. కానీ.. ''కేవలం ఎంపీ పదవితో హోదా వచ్చేయదు బాబూ.. బయటనుంచి ఏదో తిట్టేయడం కాదు.. ఈ పదవిలోకి రా.. అసలు నీ కతేంటో తేలుతుంది'' అని హెచ్చరించినట్లుగా ఈ వ్యాఖ్యలున్నాయి.
Full View