అవును నిజమే..గంటా ఫ్యాను గాలి కావాలనుకున్నారు

Update: 2019-02-19 08:52 GMT
అవంతి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీ... ఈ పేరు గత నాలుగు రోజులుగా మీడియాలో వినిపిస్తోంది. తెలుగదేశం పార్టీకి రాజీనామ చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరినా ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తనదైన శైలిలో విమశ్రనాస్త్రలు సంధించారు. తెలుగుదేశం అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు, ఒకవేళ ప్రశ్నిస్తే ఆయనకు ఆగ్రహం కట్టలు త్రేంచుకుంటుంది. స్పెషల్ స్టేటస్ కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసినప్పుడు - తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని తాను సూచించానని - దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదని అవంతి శ్రీనివాస్ అన్నారు. పోనీ తాను ఒక్కడినే రాజీనామా చేద్దమనుకున్నా  కూడా పార్టీ ఒప్పుకోలేదని అవంతి శ్రీనివాస్ అన్నారు.

 గంటా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు తాను ఏమి స్పందించనని - అయితే గతంలో గంటా శ్రీనివాస్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుదామనుకున్న మాట మాత్రం వాస్తవం అని అవంతి శ్రీనివాస్ అన్నారు.  గంటా శ్రీనివాస్  ఎవరిని పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదని - మరి తనపై అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారో తనకి అర్దం కావటం లేదని అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సాయంతో ప్రతిపక్షంలో చేరిన వారిపై విషం కక్కుతున్నారని అది తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తుందని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడతో ఓడిపోయిందని - తెలుగుదేశం పార్టీ తన ఇరుపక్కల భారతీయ జనతా పార్టీ - జనసేన సాయంతో గెలిచిందని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిండు కుండలా ఉంది... తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి పూర్తి స్దాయిలో రంగంలోకి దిగితే తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్దులను వెతుకోవాల్సి ఉంటుందని అవంతి శ్రీనివాస్ అన్నారు.

Tags:    

Similar News