మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు చేరాక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన ఎంపీ సుజనాచౌదరితో సంప్రదింపులు జరుపుతున్నారని.. మంత్రి గంటా అందరినీ తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల ముందటి వరకు ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉండి వైసీపీలో చేరి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా కూడా పార్టీ మారబోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీకి భవిష్యత్ లేదని.. అందుకే గంటా బీజేపీలో చేరబోతున్నారని బాంబు పేల్చారు.
తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ ఉదయం దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ అనంతరం గంటా శ్రీనివాస్ రావును బీజేపీ ఆహ్వానించిందని.. ఆయన అందులోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టం చేశారు. గంటా ఈ ఐదేళ్లలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలోకి వలస వెళ్లడానికి రెడీ అయ్యారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.
ఇక చంద్రబాబు తమ వద్దకే వస్తారని.. ఎన్నికల ముందు అమిత్ షా చెప్పారని.. ఇప్పుడే అదే జరగబోతోందని.. టీడీపీ నేతలు ముందు వెళ్లి చంద్రబాబు వారి వెంటే తర్వాత వెళతారని అవంతి జోస్యం చెప్పారు.