అమరావతి సాగిస్తే.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఖాయం.. మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు
అమరావతిని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు వద్దంటున్నారో.. మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే పరిస్థితేంటని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అలాంటి ఇబ్బందులు రాకుండా.. ఉండాలనే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని ఆగిందంటూ చాలామంది దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండేందుకే.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయని మంత్రి తెలిపారు.
"రాజధాని ఆగిందని చాలామంది ప్రచారం చేస్తున్నారు. గతంలో అందరూ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టారు. మరో 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే ఏం చేస్తాం? అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం. కర్ణాటక, ఝార్ఖండ్ కూడా 3 రాజధానులు పెట్టాలని చూస్తున్నాయి. విశాఖ అంటే సీఎం జగన్‌కు అత్యంత ప్రేమ ఉంది. హిందూపురాన్ని జిల్లా చేయాలని బాలకృష్ణ అడిగారు. రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌పై బీజేపీ నేతలు మాట్లాడాలి`` అని అవంతి వ్యాఖ్యానించారు.
అయితే.. ఇది ఆది నుంచి వైసీపీ నేతలు చేస్తున్న వినిపిస్తున్న వాదనే. కానీ, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మాత్రం మౌనంగా ఉంటూనే.. మరోవైపు.. రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. అమరావతి రైతులు చెబుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది అవసరమేనని..అ యితే.. రాజధానులను ఏర్పాటు చేయడమే దీనికి అంతిమ పరిష్కారమా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే నిజమని నమ్మితే.. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిరాష్ట్రంలోనూ ఒక రాజధానిని ఏర్పాటు చేయాల్సి వస్తుందని.. అప్పుడు ఏమంటారని.. ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. అవంతి వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీస్తున్నాయి.