ఫ్లైట్ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్

Update: 2016-07-18 10:44 GMT
ఉన్నట్లుండి విమానాలు క్యాన్సిల్ కావటం.. గంటల కొద్దీ వాయిదా పడటం.. ఇష్టారాజ్యంగా లగేజ్ ఛార్జీలు వసూలు చేయటం లాంటి ఎన్నో సమస్యల్ని విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటివి ఇబ్బందులకు చెక్ పెట్టటమే కాదు.. పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. త్వరలో అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త రూల్స్ తో ప్రయాణికుల పాలిట గుడ్ న్యూస్ గా చెప్పాలి. అదే సమయంలో విమానయాన సంస్థలకు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త పాలసీతో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను పెద్ద ఎత్తున తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటమే కాదు.. విమానం కానీ క్యాన్సిల్ అయిన పక్షంలో టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసిన ఛార్జీలను సైతం చెల్లించాలని తేల్చింది. అంతే కాదు.. విమానం క్యాన్సిల్ అయినా.. లేట్ అయినా ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

రెండు గంటల లోపు విమానం రద్దు అయిన పక్షంలో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో 24 గంటల్లోపు వేరే విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో మరో రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుంది కూడా. రిఫండ్ కూడా దేశీయపు ప్రయాణాలకు 15 రోజుల్లో.. విదేశీ ప్రయాణాలకు నెల రోజుల్లో రిఫండ్ ఇవ్వాలని పేర్కొంది. ఇవన్నీ వింటుంటే.. విమాన ప్రయాణికులకు నిజమైన స్వీట్ న్యూస్ అనే చెప్పాలి కదా?
Tags:    

Similar News