తన మాటలతో.. తీసుకునే నిర్ణయాలతో తరచూ వార్తల్లో ఉండే ముఖ్యమంత్రిగా త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ ను చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఈశాన్య భారతానికి చెందిన ముఖ్యమంత్రుల వార్తలు అస్సలు వచ్చేవి కావు. విప్లవ్ పుణ్యమా అని ఆయన మాట్లాడే మాటలపై మీడియా స్పెషల్ అటెన్షన్ పెడుతున్న పరిస్థితి.
ఊహించని రీతిలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉన్నతాధికారులు ఏ డ్రెస్ వేసుకోవాలి? .. వేటికి వేసుకోకూడదంటూ ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు కలకలంగా మారాయి. ఉన్నతాధికారులు ఎవరూ అధికారిక కార్యక్రమాలు.. సమావేశాలకు జీన్స్.. కార్గో ఫ్యాంట్లు ధరించొద్దని చెబుతున్నారు. సీఎంతో సహా ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు.. చీఫ్ సెక్రటరీ సహా ఉన్నత స్థాయి అధికారుల సమావేశాలకు జిల్లా కలెక్టర్లు.. ఏడీఎంలతో పాటు జిల్లాల ఉన్నతాధికారులు సైతం జీన్స్.. కార్గోలు వేసుకోకూడదని చెబుతున్నారు.
ప్రభుత్వ సర్వీసుల్లో తనకు సుదీర్ఘ అనుభవం ఉందని చెబుతున్న సీఎం.. ఇప్పటివరకూ ఐఏఎస్ అధికారులు ఎవరూ డెనిమ్.. జీన్స్ వేసుకొని ఆఫీసులకు రావటం చూడలేదన్నారు. కొందరు ఉన్నతాధికారులు సమావేశంలో మొబైల్ ఫోన్లు చూస్తున్నారని.. ఇది అమర్యాదకరంగా ఆయన చెప్పారు. మొబైల్ సంగతిని పక్కన పెడితే.. అధికారుల డ్రెస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.