క్రికెట్ లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. అధికారిక మ్యాచ్ కాని ఈ మ్యాచ్ రికార్డు క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో భారత ఏ జట్టు మధ్య సాగుతున్న టెస్ట్ సిరీస్ లో అదిరిపోయే రికార్డు ఒకటి నమోదైంది.
కేరళలోని వాయ్ నాడ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఏ.. దక్షిణాఫ్రికా ఏ జట్టు మధ్య సాగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత యువ స్పిన్ బౌలర్ అక్సర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో సఫారీ జట్టు వెన్ను విరిచారు. కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్సర్ పటేల్ ఒక్క పరుగు ఇవ్వకుండానే.. నాలుగు వికెట్లు తీయటంతో సఫారీ ఏ జట్టు కుప్పకూలిపోయింది.
దీంతో.. నాలుగు రోజులకే టెస్ట్ మ్యాచ్ ముగియటంతో పాటు.. భారత్ ఏ జట్టు 1-0 అధిక్యంతో ఉంది. ఆరు ఓవర్లు.. ఆరు మెయిడెన్లు.. నాలుగు వికెట్లతో అదిరిపోయే రికార్డును అక్సర్ నమోదు చేశారు. అక్సర్ మాయాజాలంతో ధక్షిణాఫ్రికా ఏ జట్టు కేవలం 76 పరుగులకే తన రెండో ఇన్నింగ్స్ ను ముగించింది.