అయేషా హత్య కేసులో సీబీఐ దూకుడు

Update: 2019-01-30 09:24 GMT
అయేషా హత్య కేసు విషయంలో సీబీఐ దూకుడు పెంచుతోంది. అనేక ట్విస్టులతో కొనసాగుతున్న అయేషా హత్య కేసును సీబీఐ లోతుగా విచారిస్తూ ముందుకెళుతోంది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. ఈక్రమంలో అయేషా హత్య కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయేషా హత్య కేసుకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో కోర్టు సిబ్బందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ ఇప్పుడు కేసు సమయంలో విజయవాడలో విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బంది - కమిషనర్లను విచారించేందుకు సిద్ధమైంది. ఈ కేసులో అప్పటి కమిషనర్ సీవీ ఆనంద్ - ప్రత్యేకాధికారిగా వ్యహరించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్ సహా మరో ముగ్గురు కమిషనర్లు - ముగ్గురు ఏసీపీలు - తొమ్మిది మంది కానిస్టేబుళ్లను సీబీఐ విచారించనుంది. నాడు ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణ తీరు - సాక్షుల స్టెట్ మెంట్లు.. కేసులో వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

12ఏళ్లుగా అయేషా హత్య కేసు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా వారు చేతులేత్తయడంతో కోర్టు సీబీఐని రంగంలోకి దింపింది. సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచి కొత్త కొత్త ట్విస్టులు బయటికి వస్తున్నాయి. ఎన్నో మలుపులు తిరుగుతున్న అయేషా హత్యలో సీబీఐ దూకుడు చూస్తుంటే ఈసారి దోషులు పట్టుబడటం ఖాయంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరీ.
Tags:    

Similar News