అయోధ్య రామ మందిరం బాబ్రీమసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. వివాదాస్పదంగా ఉన్న భూమి రామ్ లల్లా కే చెందుతుందని వెల్లడించింది. అలాగే అయోధ్య లో ముస్లింల కి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని తెలిపింది. వివాదాస్పదంగా ఉన్న భూమి ని రామ్ లల్లా విరాజ్‌మాన్‌కు చెందుతుందని తీర్పు చెప్పింది.ఈ కేసులో రామ్ లల్లా విరాజ్‌మాన్ ఈ కేసులో పిటిషనర్ గా ఉంది. దీనితో అందరిలో ఈ రామ్ లల్లా ఎవరూ అనే అనుమానాలు మొదలైయ్యాయి ..
ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న రామ్ లల్లా మరెవరో కాదు విరాజ్‌మాన్ రాముడి విగ్రహం. ఇక కేసులో రామ్ లల్లా తరుపున సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు .ఆలయంలో దేవుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి విగ్రహం ఈ కేసులో పిటిషనర్ ఉండటం ఆసక్తికరంగా మారింది. రామ్ లల్లా కేసు తో ముడిపడి ఉండటమేంటంటూ గతంలో అలహాబాద్ హై కోర్టు లో వాదనల సందర్భంగా ఒక ప్రశ్న వచ్చింది. ఆలయాలు, లేదా అందులో ఉన్న దేవుడి విగ్రహాల తరపున ట్రస్టీలు ఉండొచ్చని చట్టంలో ఉంది. అయితే ఆలయాలు వాటి ఆస్తులను చాలా సందర్భాల్లో ట్రస్ట్ మెంబెర్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇక అయోధ్య కేసులో రామ్ లల్లా మైనర్‌గా చూస్తున్న నేపథ్యంలో గార్డియన్ ఈ కేసులో కోర్టుకు హాజరవుతూ వచ్చారు.
సుప్రీం కోర్టు ఒక ప్రకటనలో భాగంగా .. ఒక కేసులో పిటిషనర్ గా ఉండాలి అంటే కేవలం మనుషులు మాత్రమే కావాలనే రూల్ లేదని, వస్తువు కూడా ఉండచ్చు అని తెలిపింది. హిందూ చట్టం ప్రకారం విగ్రహాలు కూడా చట్ట పరిధిలోకి వస్తాయని ఉంది. ఇందులో భాగం గానే శ్రీరాముడి విగ్రహం కూడా అయోధ్య కేసులో చట్ట పరమైన వ్యక్తికిందనే ట్రీట్ చేయడం జరుగుతోంది. హిందూ విగ్రహాలు చట్ట పరిధి లోనే ఉంటాయని కోర్టులు గుర్తిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహం బాగోగులు ఎవరైతే చూస్తున్నారో అట్టివారిని గార్డియన్ లేదా మేనేజర్ గా కోర్టులు పరిగణిస్తున్నాయి. ఇక అయోధ్య కేసు లోని భూమి శ్రీరాముడి కి చెందినది అని తీర్పు రావడం తో ఇప్పుడు దీనికి సంబంధించిన భూమిపై అన్ని హక్కులు ట్రస్టుకు ఉంటాయి.