బాబూ నువ్వ్ చూడు.. ‘అయ్యన్న’ వేసిన స్టెప్పూ

Update: 2020-02-29 13:27 GMT
ఆనందమొచ్చినా.. కక్కొచ్చిన ఆగదంటారు.. దాన్ని అలానే బయటపకు పోనీయ్యాలి.. లేదంటే లావు అయిపోతాం.. సినిమా డైలాగ్ ను అటూ ఇటూ మార్చినా అది అక్షర సత్యమే.. రాజకీయ నాయకులు ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు. ఇంటా బయటా ఒకటే మేనరిజం మెయింటేన్ చేస్తుంటారు. వారి ఆనందాలు, ఆవేశాలు అంత త్వరలో చూడలేం.

కానీ తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బయటపడ్డాడు. తన కొడుకు పెళ్లిలో ఆయన చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఎల్లువచ్చి గోదారమ్మ’ పాటలో లయబద్ధంగా అయ్యన్నపాత్రుడు చేసిన డ్యాన్స్  కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహం విశాఖపట్నంలో జరిగింది. ఈ పెళ్లి రిసెప్షన్ లో మాజీ మంత్రి అయ్యాన్నపాత్రుడు డ్యాన్స్ చేశారు.

‘దేవత’ సినిమాలో శోభన్ బాబు ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ పాటకు అయ్యన్న ఇద్దరు యాంకర్లతో కలిసి స్టెప్పులేయడం విశేషం. యువతుల చేతులు పట్టుకొని మనోడు ఇరగదీశాడు. ఇక ‘గున్న గున్న మామిడి ’ పాటకైతే చిందులేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం అయ్యన్న వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.


Tags:    

Similar News