జగన్ మీద అయ్యన్న మంటకు రీజన్...?

Update: 2021-12-03 11:33 GMT
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఒక విధంగా చెప్పాలీ అంటే పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు కంటే కూడా సీనియర్. ఇక ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న పిన్న వయసులోనే మంత్రి అయ్యారు. అది లగాయితు ఎన్నో మార్లు కీలక మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఘనత కూడా ఆయనదే. అలాంటి అయ్యన్నపాత్రుడుకు ఆది నుంచి దూకుడు ఎక్కువ. నిజానికి అదే ఆయన పొలిటికల్ కెరీర్ కి ఎన్నో సార్లు ప్లస్ అయింది. కొన్ని సార్లు మైనస్ కూడా అయింది.

తాను అనుకున్నది ఏదైనా ఉందంటే కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేయడం అయ్యన్న అలవాటు, ఆ విషయంలో పార్టీకి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన అసలు ఏమాత్రం సంకోచించరు. చంద్రబాబుకు వీరవిధేయుడు అయిన అయ్యన్నపాత్రుడు వర్తమాన రాజకీయాల్లో చూసుకుంటే ఒక విషయంలో మెచ్చుకోవాల్సిందే. అందరూ అనేక పార్టీలు మారుతూ వస్తున్నారు, కానీ అయ్యన్న మాత్రం తాను నమ్ముకున్న టీడీపీతోనే కడవరకూ తన ప్రయాణం అన్నట్లుగానే ఉంటున్నారు.

టీడీపీ కోసం కమిటెడ్ గా పనిచేసే సీనియర్లలో ఆయన ఒకరుగా చెప్పుకోవాలి. అలాంటి అయ్యన్నపాత్రుడుకి జగన్ అంటే మాత్రం చాలా మంటగా ఉంటుంది. అది ఆయన మాటలతో ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు. ఆ మధ్య ఆయన గుంటూర్లో జగన్ గురించి మాట్లాడిన మాటలు ఏపీలో ఎంతటి వేడిని పుట్టించాయో అందరికీ తెలిసిందే. దీని మీద ఆయన ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు జగన్ మీద ఉన్న అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టేశారు.

వైఎస్సార్ ని చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుందని, అదే జగన్ని చూస్తే మాత్రం దండం పెట్టడానికి మనసొప్పదంటూ అయ్యన్న‌ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ దుర్మారంగా వ్యవహరిస్తున్నారని కూడా హాట్ హాట్ కామెంట్శ్ ని చేయడం గమనార్హం. జగన్ ది తుగ్లక్ పాలన అంటూ నిందించారు. నిజానికి ఈ విషయంలో అయ్యన్న మాత్రం జగన్ పాలనను ఎండగట్టడానికి ఎపుడూ ముందుంటారు.

అందుకేనా జగన్ పేరు చెబితే అయ్యన్న ఒంటికాలు మీద లేస్తారు అన్న చర్చ కూడా వస్తోంది. ఒక విధంగా ఆ రోజుల్లో వైఎస్సార్ అంటే కూడా టీడీపీ నేతలు మండిపడేవారు. అయితే ఇపుడు జగన్ తో పోల్చిచూస్తూ వైఎస్సార్ ఈజ్ గ్రేట్ అంటున్నారు అనుకోవాలి. ఏది ఏమైనా జగన్ రాజకీయంగా ఏమి సాధించినా లేకపోయినా కూడా తన తండ్రి గొప్పవాడు అని తనకంటే మంచివాడు అని కరడు కట్టిన టీడీపీ నేతల చేత అనిపిస్తున్నారు అనుకోవాలేమో. మొత్తానికి జగన్ మీద తరచూ అయ్యన్న ఫైర్ అవడానికి అసలైన రీజన్ ఏంటో చెప్పేశారు.

ఇక ముందు కూడా ఆయన ఇలాగే జగన్ విషయంలో మాట్లాడుతారు. మరి ఇక్కడ మారాల్సింది జగనా. అయ్యన్నా అంటే ఎవరూ మారరు అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి రాజకీయ పంధా వారిది. జగన్ దూకుడు టీడీపీకి దుర్మార్గం అవుతోంది. టీడీపీ నేతల నోటి వాచాలత వైసీపీకి మింగుడు పడనిదిగా మారుతోంది. ఈ రాజకీయ కధ ఇంతే అని ఏపీ జనాలకు మాత్రం బాగా అర్ధమవుతోంది.
Tags:    

Similar News