విశాఖ జిల్లా రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా.. ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు.. గంటా శ్రీనివాసరావుల మధ్యనున్న రాజకీయ వైరం ఎంత పెద్దదో ఇట్టే తెలుస్తుంది. ఒకే మంత్రివర్గంలో ఉన్నా.. తూర్పు పడమరులుగా వ్యవహరించే ఈ ఇద్దరు నేతలు మాట వరసకు సైతం మాట్లాడుకున్నది కనిపించదు. వీరి మధ్య వైరం ఎంత ఎక్కువంటే.. ఒకరి వర్గానికి చెందిన వారు పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తే.. రెండో వారు అడ్డు పడతారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. తమ మాటలతో.. చేష్టలతో అధినేత నిర్ణయం తీసుకోకుండా ముందరకాళ్ల బంధాలు వేస్తారు.
అలాంటి వీరిద్దరూ ఒక వేదిక మీద కలవటమే గొప్ప అయితే.. ఇద్దరూ సరదాగా ‘పంచ్’ లు విసురుకోవటం మరింత ఆసక్తికరంగా చెప్పాలి. ఇదంతా కొత్త సంవత్సరం స్టార్ట్ కావటానికి కాస్త ముందుగా విశాఖ తీరంలో జరిగిన ఒక కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఏ మాత్రం సఖ్యతగా ఉండని ఈ ఇద్దరూ.. బాక్సింగ్ పోటీల్ని స్టార్ట్ చేసేందుకు వచ్చారు. అలా వచ్చిన సందర్భంగా ఈ ఇద్దరు తెలుగు తమ్ముళ్లు చేతికి గ్లౌజులు వేసుకొని ఒకరిపై ఒకరు సరదాగా పంచ్ లు విసురుకున్నారు.
అయ్యన్న బ్లూకలర్ గ్లౌజులు వేసుకుంటే.. గంటా మాత్రం రెడ్ కలర్ గ్లౌజ్ లు ధరించి ఒకరిపై ఒకరు నవ్వులు చిందిస్తూ పంచ్ లు విసురుకోవటం అందరికి కన్నుల పండువగా మారింది. మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం ఈ సరదా సన్నివేశాన్ని ఇరువురు నేతలు పండించటంలో వందకు వంద మార్కులు పడిన పరిస్థితి. హుషారు వాతావరణంలో ఫ్రెండ్లీగా కనిపించిన ఈ ఇద్దరు నేతలు.. తమ పాత విభేదాలు పక్కన పెట్టి.. ఇరువురు చేతులు కలిపి విశాఖ అభివృద్ధి కోసం పాటు పడితే.. విశాఖ ప్రజలకు అంతకు మించిన సంతోషం ఇంకేం ఉండదేమో. వీరిద్దరి మధ్య పంచాయితీలు సమిసిపోతే.. విశాఖ ప్రజలే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిరోభారం సైతం తగ్గుతుంది.