పులి కేక : అయ్యన్న వర్సెస్ విజయసాయిరెడ్డి

Update: 2022-06-26 02:30 GMT
సాధారణంగా ఎవరైనా  గట్టిగా పెట్టే కేకను పొలికేక అంటారు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయ రచ్చలో మాత్రం  పులికేక గట్టిగా వినిపిస్తోంది. నర్శీపట్నం పులి అయ్యన్న అని చినబాబు లోకేష్ ఈ మధ్యనే  ట్యాగ్ తగిలించేశారు. మా మాస్ రాజా  అని టీడీపీ తమ్ముళ్ళు అయ్యన్నను నెత్తిన పెట్టుకుంటారు. ఇటీవల ఆయన ఇంటి ప్రహారీ గోడను టచ్ చేసి వైసీపీ పెట్టిన కలి అంతా ఇంతా కాదు.

ఆ తరువాత విశాఖ వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నను బాగా కెలికారు. కోర్టు స్టే తెచ్చుకుని టెంపరరీగా అయ్యన్న హ్యాపీ కావచ్చు కానీ ఆయన అక్రమణను రుజువు చేస్తాం, భారీ యాక్షన్ ఉంటుంది అని బిగ్ సౌండ్ చేశారు. దానికి రిప్లై గా అయ్యన్న వారూ వీరూ ఎందుకు విజయసాయిరెడ్డి నీవు రా ఇద్దరం తేల్చుకుందామని రెట్టించారు.

దాన్ని కంటిన్యూ చేస్తూ విజయసాయిరెడ్డి నరసింహానాయుడు సినిమా డైలాగులు పేల్చారు. ప్లేస్ డేట్ టైమ్ నీవు చెప్పు ఎప్పుడైనా ఎక్కడానా నేను వచ్చేందుకు రెడీ అంటూ ఆ సవాల్ ని ఓకే చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నను పట్టుకుని గంజాయి అయ్యన్న అని తాగుబోతూ అని సెటైర్లు వేశారు.

ఇలా సాయిరెడ్డి ట్వీట్ చేశారో లేదో అలా అందిపుచ్చుకున్న అయ్యన్న నేను రెడీ కానీ నీవు ఒక్కడివే సింగిల్ గా రావాలి, పులి వెంట పోలీసులు ఉండరు కదా అని వెటకారం ఆడారు. అయినా నీవు పులి ఏంటి. పదహారు నెలలు జైలులో ఉండడం వల్ల పోలీసులు కొట్టిన దెబ్బలకు శరీరంలో మచ్చలు ఏర్పడితే ఆ చారలను చూసుకుని పులి అని భ్రమిస్తున్నావని బాగానే సెటైర్లు  వేశారు.

దానికి ముందు అయ్యన్నను కూడా పులి కాదు పిల్లి అంటూ విజయసాయిరెడ్డీ ఎద్దేవా చేశారు. పులి అయితే పారిపోదు,  పిల్లి కాబట్టే అజ్ఞాతంలో ఉందని అన్నారు. అంత అద్వాన్నంలో మీ ప్రభుత్వంలో సమాచార వ్యవస్థ ఉందా సాయిరెడ్డీ. నేను ఏ అజ్ఞాతంలోనూ లేను, ఇదీ మీ ప్రభుత్వ నిర్వాకం అంటూ కౌంటర్ వేశారు.

ఇలా నేను రెడీ అంటే నేను రెడీ అంటూ అయ్యన్న సాయిరెడ్డి చేసుకుంటున్న సవాళ్ళు నర్శీపట్నంలో మళ్ళీ రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఇక నీవు పులి కాదు పిల్లి అని సాయిరెడ్డి అంటే నీవు మాత్రం పులి అనుకుంటున్నావా అని అయ్యన్న అనడమూ కౌంటర్ అదిరింది అని తమ్ముళ్ళు అనుకునేలా చేసింది. అయినా ఈ పులి పిల్లి చెలగాటమేంటి. రాజకీయాల్లో ఇవన్నీ అవసరమా అంటే మాత్రం ఈ నేతలు ఊరుకుంటారా. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News