'రా.. తేల్చుకుందాం!'.. సాయిరెడ్డికి అయ్య‌న్న స‌వాల్‌

Update: 2022-06-24 15:31 GMT
వైసీపీ కీల‌క నాయ‌కుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు ``రా తేల్చుకుందాం!`` అంటూ.. స‌వాల్ విసిరారు. ``న‌న్ను ఎదుర్కోడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా న‌ర్సీప‌ట్నంలోనే ఉంది.

జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆర్డీవోలు, వంద‌ల సంఖ్య‌లో పోలీసులు.. ప‌దుల సంఖ్య‌లో పోలీసు వాహ‌నాలు, సోష‌ల్ మీడియా కేసులు.. ఇంత భ‌యం ఎందుకు సాయిరెడ్డీ. ద‌మ్ముంటే నేరుగా నువ్వే న‌ర్సీప‌ట్నం వ‌చ్చెయ్ తేల్చుకుందాం!`` అని అయ్య‌న్న ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా.. అయ్య‌న్న‌ను టార్గెట్ చేసిన ప్ర‌భుత్వం.. రెండు రోజుల కింద‌ట‌.. ఆయ‌న పండ కాలువ‌ను క‌బ్జాచేసి ఇల్లుక‌ట్టుకున్నార‌ని ఆరోపిస్తూ.. న‌ర్సీప‌ట్నంలో ఉన్న ఆయ‌న ఇంటిని కూల‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. జేసీబీ డ్రైవ‌ర్ పారిపోవ‌డం.. తెలుగు దేశం పార్టీ శ్రేణులు తిర‌గ‌బ‌డ‌డంతో అధికారులు వెన‌క్కి త‌గ్గారు. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో.. హైకోర్టు అయ్య‌న్న‌కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయ‌న ఇంటి ప్ర‌హ‌రీని కూల్చ‌డం త‌ప్పుబ‌ట్టింది.

ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా వివాదం మ‌రింత ముదిరింది. విజ‌య‌న‌గ‌రంలోని చీపురుప‌ల్లిలో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులో అయ్య‌న్న సీఎం జ‌గ‌న్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ.. పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అదేవిధంగా ఓ మ‌హిళా పోలీసుపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లుచేశార‌ని కూడా కేసులు న‌మోదు చేశారు. దీంతో అయ్య‌న్న‌ను ఎప్పుడైనా అరెస్టు చేసేందుకు పోలీసులు ఎదురు చూస్తున్నారు.

ఇక‌, ఈ వివాదంపై తాజాగా స్పందించిన అయ్య‌న్న‌.. సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని.. విశాఖ‌లో అయ్య‌న్న‌ను ప‌క్క‌న పెడితే.. వైసీపీకి తిరుగులేద‌ని భావిస్తున్నార‌ని.. టీడీపీ వ‌ర్గాలు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అయ్య‌న్న చేసిన స‌వాల్ ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రిదీనిపై సాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News