వాడి పేరు అయ్యప్ప.. డెలివరీ బాయ్

Update: 2017-01-05 14:27 GMT
న్యూఇయర్ సందర్భంగా గార్డెన్ సిటీ పరువు మొత్తాన్ని గంగపాలు చేసిన వైనం తెలిసిందే. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని రోడ్ల మీదకు వచ్చిన అమ్మాయిల మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. పశువుల మాదిరి వ్యవహరించిన మృగాళ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. బెంగళూరు మగాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. అదే రోజు రాత్రి ఒక వీధిలో తన ఇంటికి వెళుతున్న ఒక అమ్మాయిని టూవీలర్ మీద వచ్చిన ఒకడు.. బలవంతంగా వ్యవహరించటం.. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించిన తీరు సీసీ కెమేరాలో రికార్డు కావటంతో.. దారుణ ఘటన ప్రపంచానికి తెలిసింది. బెంగళూరులో మరీ ఇంత దారుణ పరిస్థితి ఉందా? అన్నట్లుగా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఘటన సృష్టించిన సంచలనం నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఈ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. ఈ ఘటనకు బాధ్యత ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నా పశువు కంటే హీనంగా వ్యవహరించిన వ్యక్తిని అయ్యప్పగా గుర్తించారు. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఇతడు.. ఐటీఐ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గడిచిన కొన్ని రోజులుగా బాధితురాలి వెంట పడుతున్నాడని.. ఆమెను వేధిస్తున్నట్లు గుర్తించారు. న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న ఆమెను అయ్యప్ప.. అతని స్నేహితులు వేధించారని.. ఆమె ఇంటికి దగ్గర్లోని అయ్యప్ప నివాసం ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు చేయనప్పటికీ.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News