ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నాయకులు జంపింగ్ జపాంగ్ అవ్వడం చాలా కామన్. అధికారం లేని పార్టీ నుంచి అధికారం వచ్చిన చోటికి చేరిపోవాలని ప్రతీ ఒక్కరూ ఆశపడతారు. అయితే.. కీలక నాయకులు మారుతున్నారని వార్తలు వచ్చినప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్‌పై వచ్చాయి.
అజహర్ త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని.. ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ సీట్ కూడా కన్‌ఫర్మ్ అయ్యిందని వార్తలు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు, అజహర్‌కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం చేశారని… ఇక అజహర్ కారెక్కడమే ఆలస్యం అనే వార్తలు గట్టిగానే విన్పించాయి. ఈ వార్తలు అజరుద్దీన్ వరకు వెళ్లాయి. దీంతో ట్విట్టర్ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు అజహర్. తనపై వస్తున్న వార్తలు అబద్ధం అంటూ సింపుల్‌గా ట్విట్టర్‌లో ఓ చిన్న మేసేజ్ చేశాడు.
సాధారణంగా అజహర్ లాంటి పెద్ద నేతలపై ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కాస్త గట్టిగానే రెస్పాండ్ అవుతారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ వార్తల్ని ఖండిస్తారు. కానీ అజహర్ మాత్రం.. నేనా టీఆర్‌ఎస్‌లోకా అంటూ సంతూర్ బోయ్‌లా సింపుల్‌గా చెప్పేసి కామ్ అయిపోయాడు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో అజహర్‌కు ఎంపీగా పోటీ చేయాలని ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని ఇలా ఫీలర్‌గా బయటకు వదిలారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అజహర్ మనసులో ఏముందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.