ఆన్ లైన్ యాప్ రూపొందించి అందులో యువతుల ఫొటోలు, పేర్లు పెట్టి తన ఫోన్ నంబర్ ఇచ్చి విటులను ఆకర్షిస్తూ హైటెక్ వ్యభిచారం చేస్తున్న బీటెక్ స్టూడెంట్ నిడిగొండ వీరబ్రహ్మం గుట్టును రట్టు చేశారు పోలీసులు. బీటెక్ చదువుతున్న వీరబ్రహ్మం హైటెక్ టెక్నాలజీ సాయంతో ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
గుంటూరులో ప్రస్తుతం బీటెక్ 4వ సంత్సరం చదువుతున్న వీరబ్రహ్మం ఓసారి ఆన్ లైన్లో ఓ యాప్ ద్వారా కాల్ గర్ల్స్ కోసం వెతికాడు.. రవి అనే వ్యక్తి పరిచయమై వీరబ్రహ్మం నుంచి 30వేలు తీసుకొని మోసం చేశాడు. దీంతో తాను కూడా ఇదే విధంగా హైటెక్ వ్యభిచారం చేయాలని గ్రహించి రెండేళ్లుగా ఇదే వ్యాపారం సాగిస్తున్నాడు.తనకు వచ్చిన నంబర్ల ద్వారా పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే థామస్ కుమార్ అనే వ్యక్తి వీరబ్రహ్మంకు ఆన్ లైన్ లో పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి పాత గుంటూరు లోని నందివెలుగు రోడ్డు లో గదిని అద్దెకు తీసుకొని ఈ వ్యభిచార దందా మొదలు పెట్టారు. గదికి మహిళలు,యువకులు వచ్చి వెళుతుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న వీరబ్రహ్మం, థామస్ లను అరెస్ట్ చేశారు.