రాందేవ్ బాబా చేతికి ఎన్డీ టీవీ?

Update: 2017-06-06 05:52 GMT
సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు ఒక్కోసారి నవ్వు పుట్టిస్తున్నాయి. ఎవరో ఎక్కడో సరదాగా మొదలుపెట్టిన పుకార్లు క్షణాల్లో ప్రపంచమంతా షికారు చేసేస్తున్నాయి. తాజాగా అలాంటి పుకారే ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అది.... ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీ టీవీని రాందేవ్ బాబా కొనుగోలు చేయబోతుండడం. ఈ వార్త నిన్నే తెగ ప్రచారం కాగా ఈ రోజు మరింత స్ర్పెడ్ అవుతోంది.  ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ కార్యాలయాలపై  సిబిఐ దాడుల నేపథ్యంలో ఈ పుకారు మొదలైంది.
    
సీబీఐ దాడులతో ఎన్డీటీవీ   యాజ‌మాన్యం ఉక్కిరిబిక్కిరి అయింది. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంద‌ని ప్ర‌ణ‌య్ రాయ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు... ఇదంతా నడుస్తుండగానే సోషల్ మీడియాలో రాందేవ్ బాబా దీన్ని కొనుగోలు చేయనున్నారని వార్తలు గుప్పుమ‌న్నాయి.  ఇది ఎంతవరకు వచ్చిందంటే.. ఈ పుకార్లపై ఎన్డీటీవీ కూడా స్పందించాల్సి వచ్చింది. ఆ చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిధి రజ్దాన్ దీనిపై  ట్విట్టర్లో స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఆమె ట్వీట్ చేశారు.
    
ఐసీఐసీఐ కి రూ 48 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపణలతో సిబిఐ ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈమేరకు ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధికారాయ్ లపై కూడా కేసు నమోదైంది. ఇందులో భాగమున్న ఓ ప్రైవేటు సంస్థపై కూడా కేసు నమోదైంది. దీనితో ఎన్డీటీవీ షేర్లు దాదాపు 7 శాతం నష్టపోయాయి.  ఇదంతా ఎలా ఉన్నా ఈ పుకార్లపై రాందేవ్ బాబా మాత్రం ఏమీ స్పందించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News