టీడీపీ అధినేత చంద్రబాబు ..దేశంలోనే అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అలాగే రాజకీయాలలో అపర చాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి రాజకీయ సంక్షోభంలో అయిన పరిస్థితులని తనకి అనుకూలంగా మలుచుకోవడంలో బాబు తరువాతే ఎవరైనా. టీడీపీ పరిస్థితి అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో రాష్ట్రం విడిపోయిన తరువాత తనకున్న అనుభవంతో అధికారంలోకి వచ్చారు. కానీ , తాజాగా జరిగిన ఎన్నికలలో టీడీపీ అతి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
దీనితో ప్రస్తుతం చంద్రబాబు పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టారు. కానీ , టీడీపీ లో ఉన్న కొంతమంది కీలక నేతలు కూడా బాబు కి షాక్ ఇస్తూ ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఇక ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లో మాత్రం టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనితో ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి .. ప్రతీ వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు చంద్రబాబు. తొలి రోజుల్లో ప్రతీ వీకెండ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యేవారు.
కానీ , గత రెండు వారాలుగా చంద్రబాబు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కి అయితే వస్తున్నారు కానీ , ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కి మాత్రం వెళ్లడంలేదు. దీనితో అందరూ ఈ విషయం పై అరా తీయడం మొదలెట్టారు. వీకెండ్‌లో ఆయన షెడ్యూల్ ఏంటి? అని అందరు చర్చించుకుంటున్నారు. అయన వీకెండ్ లో జూబ్లిహిల్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వైపు కాకుండా వేరే రూట్లో వెళుతున్నారట. ఇంతకీ చంద్రబాబు ఎటు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు?. శని, ఆదివారాలు చంద్రబాబు హైదరాబాద్ హఫీజ్ పేట్‌లోని ఫామ్‌హాజ్‌కు పరిమితమవుతున్నారట. చంద్రబాబుని ఎవరైనా కలవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందేనంటున్నారు. కానీ ఆ ఫామ్ హౌస్ లోకి అతి ముఖ్యమైన వారికే ప్రవేశం ఉంటుందట. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు వీకెండ్ ఫామ్ హౌజ్ మీటింగ్‌లు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని విమర్శించిన చంద్రబాబు ..ఇప్పుడు సీఎం కేసీఆర్ ని ఫాలో అవుతూ ఫామ్ హౌస్ రాజకీయాలకి తెర తీశారు. చూడాలి ఈ ఫామ్ హౌస్ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో ..