చిన్న చిన్న విషయాలకు అసహనపడిపోవటం నేతలకు ఒక అలవాటుగా మారింది. లక్షల మంది వెల్లువులా వచ్చిపడే కార్యక్రమం దగ్గర చిన్న చితకా విషయాలకు తెగ సీరియస్ అయిపోవటం సరికాదు. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా బాధ్యతలు నిర్వర్తించే అధికారులు.. పని ఒత్తిడి వల్లనో.. మరే ఇతర కారణాల కారణంగా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికే అసహనం వ్యక్తం చేయటం.. తమ పవర్ ను ప్రదర్శించాలని భావించటం ఏ మాత్రం సరికాదు. తాజాగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ వైఖరి ఇంచుమించు ఇలానే ఉంది.
తాజాగా సమ్మక్క సారలమ్మ జాతరకు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ వెళ్లారు. అమ్మల్ని దర్శించుకోవటానికి వెళ్లిన ఆయనకు.. వీఐపీ గేటు వద్ద తాళం కప్ప దర్శనం ఇవ్వటం.. ముందుకు వెళ్లే అవకాశం లేకుండా చేయటం.. అక్కడ గేటు దగ్గర డీఎస్పీ తాళం వేసేసి వెళ్లిపోవటంతో ఆయన అక్కడే నిలబడి పోవాల్సి వచ్చింది. ఆ మాత్రం దానికే బాబూ మోహన్ కు కోపం వచ్చేసింది. అధికారపార్టీ ఎమ్మెల్యేని తాను వస్తే.. గేటుకు తాళం వేసి వెళ్లిపోవటం ఏమిటంటూ ఆయన గుస్సా అయిపోయారు.
పోలీసుల తీరు ఏ మాత్రం బాగోలేదని.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని మండిపడుతున్నారు. తాను గేటు వద్దకు వెళ్లే సమయానికి డీఎస్పీ తాళం వేసుకొని వెళ్లటం కారణంగా అసహన పడిపోయిన బాబూమోహన్ దెబ్బకు తాళం పగలకొట్టి మరీ లోపలికి తీసుకెళ్లారు. ఇది చాలదన్నట్లుగా పోలీసుల మీద ఫిర్యాదు చేయటానికి సిద్ధమైపోవటం చూస్తే.. చిన్న చిన్న విషయాల్ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా బాబూమోహన్ అన్న అడగాలనిపించక మానదు. మేడారం జాతర సందర్భంగా పోలీసులకున్న పని ఒత్తిడి.. ఇబ్బందితో పోలిస్తే.. బాబూమోహన్ కు ఎదురైన ఇబ్బంది ఎంత..?