ఆ మధ్యన సంగీత దర్శకుడు కమ్ నటుడు ఆర్పీ పట్నాయక్ ప్రధాన పాత్రను పోషించిన మనలో ఒకడు సినిమా గుర్తుందా? మీడియా మీద సటైర్లు వేసిన ఆ మూవీని.. మీడియా మొఘల్ రామోజీ చేతుల మీదుగా టీజర్ విడుదల చేసిన గొప్పతనం ఆర్పీదిగా చెప్పాల్సిందే. మీడియా మీద సటైర్లు వేస్తూ.. వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. కాస్తంత క్లాస్ పీకినట్లుగా సాగే ఈ సినిమా ముచ్చట ఇప్పుడు ఎందుకంటారా? దానికి కారణం లేకపోలేదు.
రెండు రోజుల క్రితం ప్రధాన మీడియాలన్నింటిలోనూ ఒక వార్త చాలామంది దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ శాఖకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అది కూడా.. మామూలు ఏరియాలు కాకుండా సంపన్నులు.. బడాబాబులు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో. తనిఖీలు నిర్వహించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కనెక్షన్లు ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో బిల్లులు చెల్లించకపోవటంపైనా చర్యలు షురూ చేశారు.
అలాంటి వారిలో ప్రముఖ సినీ నటుడు.. రాజకీయ నాయకుడు కమ్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బాబు మోహన్ కొడుకు పేరుప్రముఖంగా వచ్చింది. రాజకీయ నేపథ్యంలో.. పలుకుబడి ఉంటే చాలు ఈ తరహాలో చెలరేగిపోవటం మామూలేగా అన్నట్లుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కొందరు చెలరేగిపోయారు.బాబు మోహన్ కుమారుడి పేరు మీద ఉన్న వాటర్ కనెక్షన్ బిల్లు బకాయి ఉన్నట్లుగా ప్రకటనలు విడుదల చేశారు. దీంతో.. బడా బాబులన్న కారణంగా చేతిలో ఉన్న అధికారంతో ఇలా చేస్తారా? అంటూ విమర్శలు చేసినోళ్లు ఉన్నారు.
షాకింగ్ విషయం ఏమిటంటే.. సదరు వార్తలో నిజం సగమేనన్న విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అధికారుల తనిఖీల్లో బాబు కుమారుడి పేరు మీద ఉన్న ఇంటికి అక్రమ కనెక్షన్ నిజమే అయినా.. ఆ ఇంటిని బాబు మోహన్ అమ్మేసి చాలా కాలమే అయ్యింది. అయితే.. ఆ ఇంటి యజమాని మారినా.. వాటర్ కనెక్షన్ పేరు మాత్రం మారలేదు. దీంతో.. ఇప్పుడు ఎవరైతే అసలు యజమానో.. వారు బిల్లు కట్టనప్పటికీ.. చెడ్డపేరు మాత్రం బాబుమోహన్ ఫ్యామిలీకి వచ్చింది.
ఈ విషయాన్ని వాటర్ బోర్డు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. అయితే.. తప్పు తమది కాదని.. బాబుమోహన్ వాళ్లు ఇల్లు అమ్మేసిన తర్వాత వివిధ కనెక్షన్లకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నాయా? లేదా? అన్నది వారి బాధ్యతే కాబట్టి.. తమ తప్పు ఏమీ లేదని తేల్చేశారు. అయితే.. ఈ ఎపిసోడ్ లో ఇమేజ్ డ్యామేజ్ అయిన బాబు మోహన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పునకు మరెవరో బలి కావటం అంటే ఇదేనేమో? తాజా ఉదంతంలో ఎప్పటిలానే మీడియా జరిగిన తప్పునకు సంబంధించిన ఎలాంటి వార్తను పబ్లిష్ చేయలేదు.