ఇద్దరు చంద్రులు రెండు తెలుగు రాజకీయాలలో రాజకీయం ఎపుడూ మజాగానే ఉంటుంది. ఈ ఇద్దరూ అపర చాణక్యులుగా చెప్పాలి. తెలుగుదేశం లో కలసి పనిచేశారు. ఆ తరువాత కేసీయార్ సొంత స్టేట్ ని సాధించి రాజ్యమేలుతూ వచ్చారు. కేసీయార్ తో చంద్రబాబు ఫైటింగ్ కూడా చిత్రంగా ఉండేది.
హైదరాబాద్ లో ఉంటున్నా టీయారెస్ ని ఏమీ అనకుండా ఫుల్ గా ఏపీ మీదనే బాబు తన ఫోకస్ పెడుతూ వచ్చారు. ఎన్నికల వేళ మాత్రం పొత్తులతో కాస్తా హడావుడి చేస్తూ బాబు తెలంగాణా టీడీపీని అలా నడిపిస్తున్నారు. అయితే కేసీయార్ జాతీయ పార్టీగా బీయారెస్ ని మార్చేశారు.
మౌనంగా ఉన్న బాబు చేతనే మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నారు. ఏపీలో బీయారెస్ జెండా గట్టిగా ఎగరాలంటే అక్కడ ప్రత్యర్ధి పార్టీల ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలి. చూడబోతే కేసీయార్ తన పాత పార్టీ తెలుగుదేశం ఓటు బ్యాంక్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం ఓటు బ్యాంక్ లో కాపులు బీసీలు ప్రధానం. బీసీ ఓటింగ్ మీద వైసీపీ కన్నేసింది. తన వాటా తేల్చుకోవాలనుకుంటోంది. కాపుల విషయంలో కూడా పోటీగా బీయారెస్ బరిలోకి దిగుతోంది. అలాగే బీసీలను కూడా వదిలిపెట్టకూడదు అని బీయారెస్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఉత్తరాంధ్రా బీసీలకు అతి పెద్ద అడ్డాగా ఉంది.
అక్కడే కేసీయార్ తన తొలి ఏపీ బీయారెస్ సభను నిర్వహించాలని చూస్తున్నారు. అంటే డైరెక్ట్ గా తెలుగుదేశం కంచుకోటల్లోకే కారుని పోనివ్వాలని గులాబీ బాస్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే విధంగా కాపులను కూడా ఆకట్టుకోవడమే కాకుండా గోదావరి జిల్లాలకు చెందిన తోట చంద్రశేఖర్ నే ఏరి కోరి మరీ బీయారెస్ ఏపీ ప్రెసిడెంట్ గా చేయడం వెనక కేసీయార్ పక్కా వ్యూహం ఉంది అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే ఏపీలో తెలుగుదేశం పొత్తులను చిత్తు చేయడానికి కేసీయార్ పధక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీలో ఎర్రన్నలకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడుతోంది. వారు చంద్రబాబుతో కలవాల్సి ఉంది. అలాగే కధ సాగుతోంది. కానీ తెలంగాణా నుంచి దేశంలో అన్ని చోట్లా బీయారెస్ తో కలసి నడవాలని వామపక్షల జాతీయ నాయకత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వారిది బీజేపీ వ్యతిరేక భావజాలం. దాన్ని తన భుజాన మోస్తున్న కేసీయార్ గట్టి సంకల్పానికే కామ్రేడ్స్ శభాష్ అంటున్నారు. కేసీయార్ తో పోలిస్తే మోడీని గట్టిగా వ్యతిరేకించే వారు ఏపీలో మరో పార్టీ కూడా లేకపోవడంతో ఏపీలో కూడా బీయారెస్ వెంట కామ్రేడ్స్ నడిచే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఆప్ తో కూడా పొత్తులు పెట్టుకుని ఏపీ బరిలోకి దిగాలని కేసీయార్ చూస్తున్నారు.
ఆప్ అంటే మధ్యతరగతి ఉన్నత వర్గాలలో మంచి అభిప్రాయం ఉంది. దాంతో ఆ వర్గం ఓటర్లు బీయారెస్ వైపు ఆకర్షితులు అవుతారు అని అంటున్నారు. ఇక కామ్రేడ్స్ కి ప్రతీ నియోజకవర్గంలో కొన్ని ఓట్లు ఉన్నాయి. ఇలా ఏపీలో పొత్తులను కొత్త ఎత్తులతో పటిష్టం చేసుకుంటూ కేసీయార్ ముందుకు పోతే కనుక అది విపక్ష పార్టీలకే ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటుంది అని అంటున్నారు
జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు చీలనివ్వమని విపక్షాలు శపధం చేసి మరీ ఒక జట్టుగా కూడుతున్న తరుణంతో కేసీయార్ బీయారెస్ పెట్టి ఓట్ల చీలీకకు కు ప్రోత్సహిస్తే కనుక వైసీపీకి అది అడ్వాంటేజ్ గా మారుతుంది అని అంటున్నారు. అదే టైం లో మహా కూటమి అని భావిస్తున్న తెలుగుదేశం ఆశలు కూడా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు అంటున్నారు. చివరికి తెలుగుదేశం జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఏపీలో బీయారెస్ మాత్రం తెలుగుదేశం ఓటు బ్యాంక్ కే చిల్లు పెట్టేలా ఉంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.