ఇప్పటివరకూ మరే కేంద్రమంత్రికి ఎదురుకాని దారుణమైన చేదు అనుభవం బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు ఎదురైంది. అది కూడా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో చోటు చేసుకుంది. జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో బీజేపీ విద్యార్థి సంఘంగా చెప్పే ఏబీవీపీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అయ్యాక తిరిగి వెళుతున్న బాబూల్ ను వామపక్ష విద్యార్థి సంఘాలు (ఎస్ ఎఫ్ ఐ - ఏఎస్ ఐఏ - ఏఎఫ్ ఎస్ యూ - ఎఫ్ ఈటీఎస్ యూ తదితర) అడ్డుకొన్నాయి. ఘోరవ్ చేశాయి.
అయితే.. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో షాక్ తిన్నారు బాబుల్. ఈ ఇష్యూ ఘోరవ్ తో ఆగలేదు. విద్యార్థులు పలువురు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని.. తన జుట్టు లాగారని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. బాబుల్ సుప్రియో రాకను వామపక్ష విద్యార్థి సంఘాలు నల్లజెండాలు పట్టుకొని నిరసన తెలిపాయి. అయితే.. ఊహించిన రీతిలో ఆయన్ను ఘోరవ్ చేసే క్రమంలో విద్యార్థులు హద్దులు దాటినట్లుగా చెబుతున్నారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ ధనకర్ హుటాహుటిన తానే స్వయంగా వర్సిటీ వెళ్లి విద్యార్థుల మధ్యలో చిక్కుకుపోయిన కేంద్రమంత్రిని విడిపించుకొచ్చారు. దీనిపై వామపక్ష విద్యార్తి నేతల వాదన ఏమంటే.. వర్సిటీ విద్యార్థినులను కేంద్రమంత్రి దురుసుగా ప్రవర్తించారని.. అందుకే నిరసన తెలిపామంటున్నారు. అయితే.. తమ నేతను ఇంతలా చేయటాన్ని జీర్ణించుకోలేని ఏబీవీపీ కార్యకర్తలు ఆరాచకం ఎలా ఉంటుందో చూపించారు.
సాక్షాత్తు కేంద్రమంత్రి పట్ల వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఇదే సమయంలో ఏబీవీపీలో పని చేసే విద్యార్థుల్ని రగిలిపోయేలా చేసింది. అంతే.. రెచ్చిపోయిన వారు క్యాంపస్ లోని ఏఎఫ్ ఎస్ యూ కార్యాలయంలోని కంఫ్యూటర్లు.. సీలింగ్ ఫ్యాన్లు.. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి తగలబెట్టారు. దీంతో వర్సిటీ మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఈ మొత్తం ఉదంతంపై నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఎంత సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. ఒక కేంద్రమంత్రి పట్ల వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టటమేకాదు.. రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రిపై దాడి జరిగేలా సెక్యురిటీ ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.