23 ఏళ్లు దాచి.. ఇప్పుడు పిల్లోడ్ని పుట్టించారు

Update: 2015-12-15 04:44 GMT
పెరిగిన సాంకేతికతతో వైద్యశాస్త్రం చేస్తున్న అద్భుతాలకు ఈ ఉదంతం ఒక నిదర్శనం. ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ ఘటన విన్న వారు ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ పావెల్ కు ఇప్పుడు 39 ఏళ్లు. అతగాడు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు హాడ్గ్ కిన్స్ లింఫోమా అనే క్యాన్సర్ సోకింది. అతగాడిని బతికించుకోవాలంటే కీమోథెరపీ చేయించుకోవాలి. అది కానీ జరిగితే అతనికి పిల్లలు పుట్టించే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే. దీంతో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లి అంగీకారంతో..అతగాడు అంత చిన్న వయసులోనే తన వీర్యాన్ని దాచి ఉంచాడు.
చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. చివరకు  పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యన అతడికి తండ్రి కావాలన్న కోరిక బలం పెరిగింది. దీంతో.. తాను ఎప్పుడో 23 ఏళ్ల కిందట దాచి ఉంచిన వీర్యాన్ని బయటకు తీసి.. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే సాంకేతిక సాయంతో తన పిల్లాడ్ని కన్నారు.

తాజా ఉదంతంతో గతంలో ఉన్న ఒక అరుదైన రికార్డు బద్ధలైంది. గతంలో 21 ఏళ్ల పాటు దాచి ఉంచిన వీర్యంతో పిల్లల్ని పుట్టించారు. ఈసారి అందుకు భిన్నంగా.. 23 ఏళ్ల తర్వాత వీర్యాన్ని దాచి ఉంచి పండంటి పిల్లాడ్ని కనటం ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.  అప్పుడెప్పుడో 23 ఏళ్ల కిందట పుట్టాల్సిన పిల్లాడ్ని.. ఇప్పుడు భూమి మీదకు తీసుకురావటం విచిత్రమైన విషయమే కదూ.
Tags:    

Similar News