బహుశా వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసు. 18 నెలల బాలుడి కడుపులో పిండం ఏర్పడింది. గర్భిణిలాగా ఆ బాలుడి కడుపు పెరుగుతున్నది. మరోవైపు బాలుడు క్రమంగా క్షీణించసాగాడు. అతడి కడుపులో మాత్రం పిండం పెరుగుతూ వస్తున్నది. ఈ కేసును సవాలుగా తీసుకున్న వైద్యులు.. బాలుడి కడుపులోంచి పిండాన్ని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్ర పూణేలోని పింప్రి ఆస్పత్రిలో చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు..
నేపాలీ సంతతికి చెందిన ఓ మహిళ 18 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పుట్టినప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బాలుడు పెరిగేకొద్ది అతడికి తరుచూ కడుపునొప్పి వస్తుండేంది. దీంతో తల్లిదండ్రులు చాలా మంది డాక్టర్లను సంప్రదించారు. అయితే పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ప్రణబ్ జాదవ్ బాలుడి సమస్యను గుర్తించారు. బాలుడి శరీరంలో మరో పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. బాలుడి తల్లి గర్భిణిగా ఉన్నప్పుడే ఆమె కడుపులో రెండు పిండాలు పెరిగాయి. అయితే వీటిలో ఒక పిండం మరో పిండంలోకి వెళ్లింది. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
అయితే బాలుడికి సోనోగ్రఫీ, సిటి స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించగా.. బాలుడి కాలేయం, కుడి మూత్రాశయం మధ్యలో పిండం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాక ఈ పిండం పెద్ద రక్తనాళాలకు అనుసంధానించబడి ఉన్నట్టు గమనించారు. అయితే ఈ పిండం అప్పటికే మృతిచెందింది. దీంతో కడుపులో ఉన్న పిండాన్ని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ప్రణబ్ జాదవ్, అతని బృందం ఆరు గంటలు కష్టపడి బాలుడిని రక్షించారు.
బాలుడి కడుపులో 550 గ్రాముల బరువు ఉంది. లోపల ఉన్న పిండానికి వేళ్లు, కాలి, చర్మం, జుట్టు, ఎముకలు, ఇతర అవయవాలు ఏర్పడ్డట్టు గుర్తించి వైద్యులు షాక్ అయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 200 వరకు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ప్రతి ఐదు లక్షల మంది పిల్లల్లో ఇటువంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు పేర్కొన్నారు.