ప్రాంతాలతో సంబంధం లేకుండా భారతదేశం మొత్తం తెలిసిన బ్రాండ్లలో ఒకటి పార్లే జీ. ఈ పేరు విన్న వెంటనే గుర్తుకొచ్చేది బిస్కెట్ అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఒక చిన్న పాప బొమ్మ. దశాబ్దాలు గడిచినా.. ఆ పాప బొమ్మ మాత్రం మారదంటే మారదు. మరి.. తరాల తరబడి ఉన్న ఆ పాప ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ పాప ఇప్పుడెలా ఉంది? లాంటి ప్రశ్నలు వేసుకుంటే వచ్చే సమాధానాల్ని వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
అసలుసిసలు దేశీయ బిస్కెట్ గా అభివర్ణించే పార్లేజీ బిస్కెట్ పాకెట్ మీద ఉండే చిన్నపాప బొమ్మ కాదు.. రియల్ ఫోటోనే. 1929 ప్రాంతంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి కేంద్రంగా మొదలైన ఒక చిన్న కంపెనీ పార్లే. నెమ్మదిగా విస్తరిస్తూ.. ఈ రోజున అతి పెద్ద బిస్కెట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఈ కంపెనీకి ఇప్పుడు 33 లక్షల డిస్ట్రిబ్యూషన్ ఔట్ లెట్స్ లో లభిస్తుంది. మరే కంపెనీ కూడా ఈ దరిదాపుల్లోకి రాకపోవటం గమనార్హం.
ఐదేళ్ల క్రితం నిర్వహించిన నీల్సన్స్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్స్ గా పార్లేజీ రికార్డు క్రియేట్ చేసింది. ఇంతటి పాపులర్ బ్రాండ్ మీద ఉండే బుజ్జి పాపకు ఇప్పుడు వయసెంతో తెలుసా? అక్షరాల 65 ఏళ్లు. పార్లేజీ బిస్కెట్ రేపర్ మీద ముద్దులొలికే చిట్టి పాప దర్శనమిస్తుంది. ఆ పాప రియల్ పాపే. కానీ.. ఇప్పుడామె పెద్దదైంది. ఆ మాటకు వస్తే ఆమె బామ్మ అయిపోయింది. ఆమె పేరు నీరూ దేశ్ పాండే. ఆమె స్వస్థలం నాగపూర్. ఆమెకు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఒక ఫోటో తీశారు. ఇక్కడ ఆయన గురించి కాస్త చెప్పాలి. నీరూ దేశ్ పాండే తండ్రి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావటంతో తన కుమార్తె ఫోటోల్ని తీశాడు. వాటిని పార్లే బిస్కెట్స్ ఆడిషన్ కు ఇచ్చారు. ఈ పాప ఫోటోల్ని చూసినంతనే ఓకే చేసేసిన కంపెనీ ఆ ఫోటోల్ని తమ బిస్కెట్ ప్యాక్ ల మీద అచ్చేసింది. అలా మొదలైన ఫోటో.. నేటికీ అలానే అచ్చేస్తూనే ఉన్నారు. పెద్ద కళ్లతో ముద్దుగా ఉండే బుజ్జిపాపను చూసిన వారు.. ఆ రియల్ పాప ఇప్పుడెలా ఉందో కూడా చూడొచ్చు. చూసినంతనే కాస్త ఆశ్చర్యం.. మరికాస్త షాకింగ్ గా అనిపించటం ఖాయం.