యూట్యూబ్ లో కేక పెట్టిస్తున్న పిల్లల వీడియో... వెయ్యి కోట్లకు పైగా వ్యూస్..!
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది. ఈ కాలంలో చాలామంది టెక్నాలజీ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. మారు మూల పల్లెటూరి పిల్లల నుంచి పట్నంలో జీవనం సాగిస్తున్న చిన్నారుల వరకు సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నారు. పదేళ్ల క్రితం పిల్లలు అంటే కేవలం బొమ్మలతో మాత్రమే ఆడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా ఫోన్ తోనే ఆటలు ఆడుకుంటున్నారు. వారికి సంగీతం వినాలనిపించినా లేదా ఏమైనా చూడాలి అనిపించినా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి అందుకు సంబంధించిన వీడియోలను చక్కగా కొట్టేస్తున్నారు. పిల్లల గోల తట్టుకునేందుకు తల్లిదండ్రులు కూడా వారు కోరినట్లుగా స్మార్ట్ ఫోన్ను వారి చేతికి ఇస్తున్నారు. అయితే వారికి ఏం చూడాలి అనేది ఎవరూ చెప్పకుండానే తమకు నచ్చిన బొమ్మల వీడియోలను వారే వెతుక్కొని చూస్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు.. అప్పుడు స్టార్ట్ చేస్తే రాత్రి నిద్రపోయే వరకు ఆ యానిమేషన్ బొమ్మలతోనే కాలం గడిపేస్తున్నారు. దీనినే ప్రామాణికంగా చేసుకుని ఓ సంస్థ పిల్లలకు సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించింది. ఈ వీడియో కేవలం పిల్లల కోసం మాత్రమే అన్నట్లుగా రూపొందించింది. కేవలం నిమిషాల వ్యవధి మాత్రమే ఉండే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇప్పటికి ఉన్నటు వంటి అనేక వీడియో లకు సంబంధించిన రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిన్నారుల వీడియో. అయితే యూట్యూబ్ లో ఆ సంస్థ అప్లోడ్ చేసిన ఈ వీడియో కు సుమారు వెయ్యి కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే సుమారు పది బిలియన్ వ్యూస్ అన్న మాట. వెయ్యి కోట్లకు పైగా వ్యుస్ వచ్చేదానికి ఈ వీడియో లో ఉన్నా నా ప్రత్యేకత ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.
సౌత్ కొరియాకు చెందిన సంస్థ ఈ వీడియోను రూపొందించింది. దాని పేరు పింక్ ఫాగ్. ఈ సంస్థ ఎడ్యుకేషన్ కి సంబంధించి వీడియోలను చేస్తోంది. దీనితో పాటు పిల్లలకు సంబంధించిన వీడియోలను కూడా కొన్నింటిని రూపొందించింది. అలాంటిదే ఈ బేబీ షార్క్ అనే వీడియో కూడా. ఇద్దరు పిల్లలు ఈ వీడియోలో కనిపిస్తారు. దీనిలో వున్న లిరిక్స్ కు తగ్గట్టుగా అప్పుడప్పుడూ తల్లిదండ్రులు, అవ్వ, తాతలు కూడా ఇందులో కనిపిస్తుంటారు. కేవలం ఈ వీడియో నిడివి 2.16 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ చిన్న వీడియోని సుమారు 10 బిలియన్లకు పైగా మంది వీక్షించారు. వాస్తవానికి ప్రపంచ జనాభా తో పోలిస్తే ఈ సంఖ్య సుమారు మూడు బిలియన్లు ఎక్కువ. ఎంతోమంది చూసినా ఈ వీడియో 2020 లోనే ప్రపంచ రికార్డును సృష్టించింది. అత్యంత ఎక్కువ మంది చూసిన వీడియో గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది. అయితే అప్పటికి ఈ వీడియోను చూసిన వారి సంఖ్య 7 బిలియన్లు మాత్రమే ఉండడం గమనార్హం.
ఈ వీడియోను పింక్ ఫాగ్ సంస్థ రూపొందించిన కానీ దీనికి లిరిక్స్ రాసింది ఎవరు అనే విషయం ఇంతవరకూ తెలియదు ఈ విషయంపై ఇప్పటివరకు సంస్థ కూడా స్పందించలేదని సమాచారం అత్యంత సాదాసీదాగా ఉండే ఇందులో లిరిక్స్ ఏ భాష వారికైనా ఇట్టే అర్థమయ్యేలా రాసారు. అందుకే ఈ పాట ఇంత ఫేమస్ అయ్యింది అని చాలా మంది భావిస్తారు. ఈ పాటకు ప్రాణం పోసింది మాత్రం కొరియాన్ – అమెరికన్ గాయని హోప్ సెగోయిన్. ఆమె గింతులో పడిన తరువాత ఈ పాటకు ఇంత మాధుర్యం వచ్చింది. అయితే ఈ పాటను ఆ సింగర్ తన 10 ఏళ్లు ఉన్నప్పుడు పాడారు అని సమాచారం.
Full View