ముఖ్యమంత్రి తాగాల్సిన నీటిలో పాము

Update: 2015-09-10 10:15 GMT
 చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు అనుకోని అనుభవం ఎదురైంది.... ఆయన తాగాల్సిన నీటిలో పాము పిల్ల కనిపించింది. అప్పుడు అక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఉన్నారు.

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి రమణ్ సింగ్ - నడ్డాలు వచ్చారు. వారికి ఇచ్చిన నీటి సీసాల్లో ఒకదాంట్లో పాము పిల్ల ఉంది....  ఓ మహిళా డాక్టర్ ఈ విషయం గుర్తించడంతో ఈ నీళ్ల సీసా రమణ్ సింగ్ కు అందకుండా ఆపగలిగారు. లేదంటే పాము ఉన్న సీసా ముఖ్యమంత్రి ముందు పెట్టేవారే.

సాధారణంగా కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి ప్రతినిధులు వచ్చినప్పుడు వారికి అందించే ఆహార పదార్ధాలను క్షుణ్ణంగా పరిశీలించి సరఫరా చేస్తారు. అయితే ఈ కార్యక్రమంలో అలాంటి తనిఖీలు ఏమీ జరగలేదట... అయితే.... అక్కడ సరఫరా చేసిన వాటర్ బాటిళ్ల ను ప్యాక్ చేసింది మాత్రం అక్కడి బీజేపీ నేత కంపెనీయే. బీజేపీ రాయపూర్ జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీకి చెందిన అమన్ ఆక్వా కంపెనీ ఈ నీళ్ల సీసాలను సరఫరా చేసిందట..
Tags:    

Similar News