జ‌గ‌న్‌ను కాద‌ని.. ఆ పార్టీ స‌ర్వ‌స్వం కోల్పోయిందా...?

Update: 2021-12-19 15:30 GMT
ఉమ్మ‌డి ఏపీలో త‌న‌కు తిరుగులేద‌ని.. త‌మ‌దే ప‌దేప‌దే అధికార‌మ‌ని.. భావించిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌. వ‌ర్గ పోరు ఎలా ఉన్నా.. నాయ‌కులు.. దూకుడుగా ముందుకుసాగారు. పార్టీని క‌దిలించేవారు.. కంపించే వారు ఎవ‌రూ లేర‌ని కూడా అనుకున్నారు. అయితే.. అదే పార్టీని అట్ట‌డుగు నుంచి క‌దిలించి వేసిన నాయ కుడు.. యువ నేత‌.. కాంగ్రెస్ నేత‌లు మ‌చ్చుకైనా ఊహించ‌ని.. నేత‌.. వైఎస్ జ‌గ‌న్‌. ఆయ‌న దెబ్బ‌తో కాంగ్రె స్ కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించుకుపోయింది.

పార్టీని ప‌ట్టుకుని వేలాడుతున్న నాయ‌కులు కూడా క‌కావి క‌లం అయిపోయారు. ఇక్క‌డ ఒక చిత్ర‌మైన విష‌యాన్ని ప్ర‌ధానంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. ఇదే కాంగ్రెస్ 2004కు ముందు.. ఉమ్మ‌డి ఏపీలో అత్యంత బ‌ల‌హీనంగా ఉంది. టీడీపీ దెబ్బ తో 275 స్థానాల్లో కేవ‌లం 18 స్థానాల‌కు ప‌డిపోయిన ప‌రిస్థితి ఉంది. అలాంటి స‌మ‌యంలో నేనున్నానం టూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి న‌డుంబిగించారు. పార్టీకి ఇక‌, అధికారం ద‌క్కుతుందో.. లేదో అన్న ప‌రిస్థితి నుంచి పార్టీని వ‌రుస విజ‌యాల దిశ‌గా తీసుకువెళ్లారు.

2004, 2009లో కాంగ్రెస్ విజ‌యంద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చింది. ఇలా అప్ర‌తిహ‌తంగా సాగిపోతున్న పార్టీకి ఇక, తిరుగులేద‌ని అనుకున్నారు. అయితే.. వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌న్‌.. పార్టీలో గుర్తింపు కొరుకున్నారు. త‌న తండ్రి క‌ష్టంతో వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న పార్టీలో కీల‌క ప‌ద‌వి కోరుకున్నారు. ఇది త‌ప్పేంకాదు. అయితే.. పార్టీలో కూట‌ములు పెరిగిపోయి.. జ‌గ‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన లాబీయింగ్ ఫలించింది. దీంతో జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. నిజానికి వైఎస్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌పై మాత్రం ద్వేషం చిమ్మారు.

ఫ‌లితంగా జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేసే వాతావ‌ర‌ణాన్ని సృస్టించారు. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. సొంతంగా పార్టీని ప్రారంభించారు. అంతేకాదు.. ఇప్పుడు అధికారంలోకి కూడా తెచ్చారు. అయితే.. ఈ  మొత్తం ఎపిసోడ్‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయింది...  ఉనికి కూడా లేకుండా చేసుకున్న‌ది.. కాంగ్రెస్ పార్టీయేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నాడు వైఎస్ అన్నీతానై.. వ్య‌వ‌హ‌రించి కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేస్తే.. జ‌గ‌న్‌కు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ నేడు పునాదులు కూడా లేక‌.. బ‌ల‌హీనంగా మారిపోయింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News