ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ జట్లు. మొత్తం 14 సార్లు లీగ్ జరిగితే ముంబై 5 సార్లు, చెన్నై 4 సార్లు కప్ ను గెల్చుకున్నాయి. దీన్నిబట్టే ఈ రెండు జట్ల స్థాయి ఏమిటో చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న 15 వ ఎడిషన్ లో చెన్నై డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. 2020 ఎడిషన్ చాంపియన్ ముంబై. అయితే, ప్రస్తుతం మాత్రం ఈ రెండు జట్లూ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్నాయి.
ఫ్యాన్ బేస్ మామాలు కాదు చెన్నై, ముంబై రెండు జట్ల ఫ్యాన్ బేస్ మామూలు స్థాయి కాదు. లీగ్ లో అభిమానుల మద్దతులో ఈ రెండు జట్లే నంబర్ 1, 2 స్థానాల్లో ఉంటాయి. వీటికి దగ్గరగా వచ్చే మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రమే. అయితే, ప్రస్తుతం లీగ్ లో ముంబై, చెన్నై పరాజయాలకు పలు కారణాలున్నాయి. ముఖ్యంగా చెన్నై పేసర్ దీపక్ చాహర్ సేవలను కోల్పోవడంతో బలహీన పడింది. లోయరార్డర్ లో బ్యాట్ తో పరుగులు సాధించే దీపక్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లు ఆడలేని పరిస్థితి.
అతడు టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఉండడంతో ఎక్కువ ఇబ్బంది పెట్టడమూ భావ్యం కాదు. ఇక చెన్నై సీనియర్లు ఊతప్ప, అంబటి రాయుడు ఫామ్ లో లేరు. నిరుడు 600 పైగా పరుగులు సాధించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సారి పది పరుగులు కూడా యలేకపోతున్నాడు. భారమంతా ధోని పైనే పడుతోంది. మరో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ మోయిన్ అలీ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. డుప్లెసిస్ లాంటి బ్యాట్స్ మన్ ను వదులుకోవడం చెన్నై ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇకపోతే బంతితో బ్యాట్ తో నమ్మదగ్గ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మెరుపులు కరువయ్యాయి. దీంతో చెన్నై నుంచి గెలుపు నకు అవసరమైన ఇన్నింగ్స్ లు రావడం లేదు.
ముంబై కష్టాలు ముంబైవి..ముంబై ఇడియన్స్ పరిస్థితి మరో రకం. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ అయ్యాక తొలిసారిగా లీగ్ లో ముంబైని నడిపిస్తున్న సందర్భం ఇది. కానీ, జట్టు ప్రదర్శన నాసికరంగా ఉంది. రోహిత్ కూడా పరుగులు చేయలేకపోతున్నాడు. దీనికితోడు పాండ్యా సోదరుల సేవలను కోల్పోయిన ముంబై లోయరార్డర్ లో బలహీనపడింది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం కావడం దెబ్బతీసింది. ఓపెనింగ్ లో డికాక్ లేకపోవడమూ పెద్ద దెబ్బే. అయితే, జట్టుగా చూస్తే బౌలింగ్ లో బుమ్రా పేస్ పదును తగ్గిందనే చెప్పాలి. పేసర్లలో అతడు కాక మిగతావారు నిరాశపరుస్తున్నారు. ఈ లోపాలన్నిటినీ సర్దుకుని ముంబై ఎలా బయటపడుతుందో
చూడాలి.
నేటి మ్యాచ్ లే కీలకం శనివారం చెన్నై.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో, ముంబై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్నాయి. హైదరాబాద్ రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. ఎలాగూ ఆ జట్టు బలహీనంగానే ఉంది. కాబట్టి చెన్నై గెలుపు పై కాస్త ఆశలు పెట్టుకోవచ్చు.
అయితే,మధ్యాహ్నం ప్రారంభమైన మ్యాచ్ లో చెన్నై 13 ఓవర్లలో 97 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఉతప్ప (15), రుతురాజ్ (16) పెద్దగా స్కోరు చేయలేదు. ఇక ముంబై.. రాత్రి మ్యాచ్ లో బెంగళూరును ఎదుర్కొననుంది. ఈ మ్యాచ్ ముంబైకి కొంత క్లిష్టమే. డుప్లెసిస్ నాయకత్వంలో బెంగళూరు కుదురుకుంది. బౌలింగ్ లోనూ మెరుగ్గా ఉంది. ఒకవేళ ముంబై, చెన్నై ఈ మ్యాచ్ ల్లోనూ ఓడితే ఆ జట్లకు వరుసగా నాలుగో ఓటమి మిగులుతుంది. లీగ్ చరిత్రలో అవి ఎన్నడూ ఎదుర్కొనని సందర్భం ఇది.