ఒకప్పుడు రాజకీయంగా దిగజారుడుతనాన్ని ప్రశ్నించాల్సి వచ్చినా.. విమర్శల్ని కురిపించాలన్నా వెంటనే కాంగ్రెస్ నేతలు గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు తాజాగాచోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు బీజేపీ అగ్రనేతల తీరు విస్మయానికి గురి చేసేలా ఉంటున్నాయి. ఒకప్పుడు విలువల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా.. ఒక్క ఎంపీ బలం లేక ప్రభుత్వం పడిపోతున్నా.. అక్రమ మార్గంలో నడిచేందుకు ససేమిరా అన్న పార్టీ.. ఇప్పుడు ఇలా బరి తెగించేస్తుందా? అన్నది చర్చగా మారింది.
అంతేకాదు..తమ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. చూసిచూడనట్లుగా వ్యవహరించే అలవాటు కాంగ్రెస్ కు ఉండేది. ఇప్పుడు అంతకు మించిన అన్న రీతిలో బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికారంలోకి రాలేని రాష్ట్రాల్ని టార్గెట్ గా చేసుకొని మరీ.. వ్యూహాత్మకంగా నిర్వహించే అంతర్గత ఆపరేషన్లతో అక్కడి ప్రభుత్వ పీఠాల కిందకు నీళ్లను తెచ్చేస్తున్న వైనాలు ఇటీవల కాలాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఆ మధ్యన కర్ణాటక ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోనూ పావులు కదపటం తెలిసిందే. చివరకు అధికారాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. పార్టీ పరిధి పెరిగినప్పటి నుంచి ఇతరత్రా సమస్యలు ఎదువుతూ ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా యూపీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న అజయ్ మిశ్రా కుమారుడు చేసిన పనికి పలువురు రైతులు మరణించటం తెలిసిందే. ఈ ఉదంతం యూపీ వ్యాప్తంగా రచ్చగా మారటమే కాదు.. ఆ రాష్ట్రంలోని యోగి సర్కారు పీఠాన్ని కదిలేలా చేస్తోంది. కీలకమైన ఎన్నికలు ముందుకు వచ్చిన వేళలో జరిగిన ఈ ఉదంతం బీజేపీకి భారీ నష్టాన్ని కలిగిస్తుందన్న మాట వినిపిస్తోంది.
యూపీలో జరిగిన డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న బీజేపీ అగ్రనాయకత్వానికి ఊహించని రీతిలో ఉత్తరాఖండ్ షాక్ తగిలింది. బీజేపీ ఏలుబడిలో ఉన్న ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పుష్కర్ థామి సింగ్ కేబినెట్ లో రవాణా శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న యశ్ పాల్ ఆర్య హటాత్తుగా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ షాక్ నుంచి కోలుకునే లోపే.. సదరు మంత్రిగారి కొడుకు కమ్ ఎమ్మెల్యే సంజీవ్ ఆర్య కూడా కాంగ్రెస్ లో చేరిపోవటమే కాదు.. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువాను వేసుకున్న వైనం మోడీషాలకు మింగుడుపడని వ్యవహారంగా మారిందని చెప్పాలి.
వాస్తవానికి ఉత్తరాఖండ్ లో గడిచిన నాలుగేళ్లుగా బీజేపీ కిందామీదా పడుతూనే ఉంది పేరుకు అధికారంలో ఉందనే కానీ.. అంతర్గత సమస్యలతో తల్లడిల్లుతోంది. ఇప్పటికే నాలుగేళ్ల పాలనలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారటం చూస్తే.. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. ఒకరు తర్వాత ఒకరు చొప్పున ముఖ్యమంత్రుల్ని మార్చేస్తున్న వైనంపై పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే ఉత్తరాఖండ్ లో బీజేపీ అధిక్యతను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు.