బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం ఎన్నో అంశాల మీద చర్చకు తావిస్తోంది. బద్వేల్ లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. ఆ విషయంలో రెండవ మాట లేదు. గత ఎన్నికలో నలభై అయిదు వేల ఓట్ల మెజారిటీ వెంకట సుబ్బయ్యకు వస్తే ఈసారి మాత్రం ఆయన సతీమణి సుధకు ఏకంగా 90 వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది. ఇక గతంలో లక్షకు దగ్గరగా వైసీపీకి ఓట్లు పడితే ఈసారి లక్షా 12 వేల ఓట్లకు అది పెరిగింది. అంటే కొత్తగా వైసీపీకి వచ్చిన పన్నెండు వేల ఓట్లు ఎక్కడివి అన్న చర్చ మొదలైంది. ఇక ఈ ఎన్నికలో పోలింగ్ శాతం చూస్తే గతానికి కంటే కూడా తొమ్మిది శాతం తగ్గింది. మరి పోలింగ్ శాతం తగ్గినా కూడా మెజారిటీ రెట్టింపు ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
బద్వేల్ లో బీజేపీకి బాగానే ఓట్లు వచ్చాయి. గతంలో 750 చిల్లరగా ఓట్లు వస్తే ఇప్పుడు ముప్పై రెట్లు ఎక్కువగా అంటే 21 వేల ఓట్లు దక్కాయి. నిజంగా ఇది గ్రేట్ అనుకోవాలి. బీజేపీకి రాయలసీమలో పెద్దగా ఉనికి లేదు. అలాంటి చోట్ల ఇంతలా ఓట్లు వచ్చాయి అంటే తెర వెనక జనసేన, టీడీపీ కారణం అని అంటున్నారు. జనసేనాని పవన్ బయటకు మద్దతు ఇవ్వకపోయినా ఆయన పార్టీ క్యాడర్ బీజేపీకి బాగానే పనిచేసారని చెబుతున్నారు. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ టీడీపీ ఓట్లను బాగానే లాగారని తెలుస్తోంది. ఇంత చేసినా కూడా బీజేపీకి డిపాజిట్లు మాత్రం సాధించలేకపోయారు.
డిపాజిట్లు రావాలి అంటే 24 వేలకు పైగా ఓట్లు రావాలి. దాంతో మూడు వేలకు దూరంగా బీజేపీ నిలిచింది. ఇక గత ఎన్నికల్లో టీడీపీకి 50 వేల ఓట్ల దాకా వచ్చాయి. ఈసారి అందులో ఇరవై వేల దాకా బీజేపీకి పోయినా మిగిలినవి ఎక్కడికి వెళ్లాయి అన్న చర్చ అయితే ఉంది. ఇక వైసీపీకి అదనంగా వచ్చిన 12 వేల పై చిలుకు ఓట్లు కచ్చితంగా టీడీపీ నుంచే టర్న్ అయ్యాయని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక టీడీపీ నుంచి వైసీపీకి ఓట్లు పడడాన్ని అద్భుతమే అనుకోవాలి. ఇది ఒక రకంగా మారుతున్న రాజకీయ సమీకరణలుగా కూడా చూడాలి. దీని మీద వైసీపీ నేతల మాటలు ఎలా ఉన్నాయి అంటే తమ సంక్షేమ పధకాల కారణంగానే టీడీపీ ఓటర్లు కూడా మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. మరి ఇదేరకంగా టీడీపీ ఓట్లతో కోత పడితే రేపటి రోజున ఇబ్బందే అనుకోవాలి. ఏది ఏమైనా టీడీపీ పోటీ చేయకపోవడం వల్లనే ఈ చీలిక వచ్చింది అన్నదే విశ్లేషణ.