తన వినాశకర విధానాలతో ప్రపంచానికి గుబులు పుట్టించటమేకాదు.. ఐసిస్ పేరు చెబితే చాలు చెమటలు పట్టేలా చేయటంలో దాని అధినేత.. దివంగత బాగ్దాదీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అగ్రరాజ్యం టార్గెట్ చేసి మరీ అతగాడిని హతమార్చిన వైనం తెలిసిందే. రహస్యంగా జరిపిన ఆపరేషన్లో బాగ్దాదీ మరణించిన విషయంలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. బాగ్దాదీ మరణానికి కారణం అతను నమ్మిన వారేనని చెప్పాలి.
మరింత వింతైన విషయం ఏమంటే.. తనకున్న ప్రాణ భయానికి ఎవరూ ఊహించలేని విధంగా తన ప్రత్యర్థి గ్రూపు నకు అడ్డా అయిన ప్రాంతంలో తలదాచుకున్న వైనం బయటకు వచ్చింది. సిరియాలో ఐసిస్ కు ప్రత్యర్థి వర్గమైన సభ్యులకు డబ్బులు చెల్లించి మరి తన షెల్టర్ ను బాగ్దాదీ ఏర్పాటు చేసుకున్నారు.
అల్ ఖైదీ అనధికార అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్ దిన్ సంస్థ ఐసిస్ కు ప్రదాన ప్రత్యర్థి. ఇరు వర్గాలకు అస్సలు పడదు. కానీ.. తన ప్రాణాలకు అమెరికా కారణంగా ముప్పు అన్న విషయాన్ని గుర్తించిన బాగ్దాది తెలివిగా.. ఎవరి అంచనాలకు అందని రీతిలో ఎత్తు వేశాడు. సాధారణంగా తన శత్రువు కల్పించే ఆశ్రయానికి ఎవరూ అంగీకరించరు. అందుకు భిన్నంగా బాగ్దాదీ మాత్రం ఆ ప్లాన్ ను వర్క్ వుట్ చేఠారు.
తాను సేఫ్ గా ఉండేందుకు దాదాపు రూ.48 లక్షల మొత్తాన్ని తన ప్రత్యర్థి వర్గ సభ్యులకు చెల్లించిన బాగ్దాదీ తన రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శరణు కోరిన శత్రువును ఆదరించటమే కాదు.. అతగాడి ఆచూకీ బయటకు రాకుండా ఉండటంలో బాగ్దాదీ ప్రత్యర్థి వర్గం మాట నిలబెట్టుకుంది.
అయితే.. బాగ్దాదీకి అత్యంత సన్నిహితులు హ్యాండిచ్చి.. అతను ఎక్కడ ఉందన్న సమాచారాన్ని అమెరికా దళాలకు అందించటంతో అతన్ని విజయవంతంగా హతమార్చగలిగారు. బాగ్దాదీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మోసం చేయటంతో.. అతడి వివరాలు బయటకు రావటమే కాదు.. అగ్రరాజ్యం అనుకున్న పనిని అనుకున్న రీతిలో విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పాలి.